Begin typing your search above and press return to search.

సూర్య కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు!

By:  Tupaki Desk   |   18 July 2022 1:30 PM GMT
సూర్య కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు!
X
టాలీవుడ్ పై వ‌రుస‌గా కోలీవుడ్ హీరోలు మ‌న‌సు పారేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ముగ్గురు హీరోలు తెలుగులో సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మ‌రో క్రేజీ హీరో చేర‌బోతున్నాడు. త‌మిళ హీరో ధ‌నుష్ తెలుగుతో `సార్‌` పేరుతో తొలి స్ట్రెయిట్ మూవీని చేస్తున్న విష‌యం తెలిసిందే. యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి ఈ మూవీని రూపొందిస్తుండ‌గా, సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్‌ సినిమాస్ బ్యాన‌ర్ ల‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో బైలింగ్వ‌ల్ మూవీగా ఇది రూపొందుతోంది. ఇదే హీరో త‌ర‌హాలో శివ కార్తికుయ‌న్ `ప్రిన్స్ `తో రంగంలోకి దిగుతున్నాడు. `జ‌తార‌త్నాలు` ఫేమ్ అనుదీప్ కె.వి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇక వీరి త‌ర‌హాలోనే స్టార్ హీరో విజ‌య్ కూడా బైలింగ్వ‌ల్ మూవీగా `వార‌సుడు`ప్రాజెక్ట్ ని చేస్తున్న‌ విష‌యం తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తోంది.

స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇదిలా వుంటే మ‌రో త‌మిళ స్టార్ హీరో తెలుగులో సినిమా చేయ‌డానికి తాజాగా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని తెలిసింది. మ‌రెవ‌రో కాదు సూర్య‌. గ‌త కొన్నేళ్లుగా అనువాద చిత్రాల‌తో హీరో సూర్య తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు. ఇక్క‌డ మంచి మార్కెట్ ని కూడా క్రియేట్ చేసుకున్నారు. అయితే గ‌త కొంత కాలంగా స్ట్రెయిట్ తెలుగు సినిమా కోసం ఎదురుచూస్తూ వ‌స్తున్నారు. బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్ లో సూర్య న‌టిస్తార‌ని, దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తార‌ని వార్త‌లు వినిపించాయి.

అయితే అది అనివార్య కార‌ణాల వ‌ల్ల చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఆగిపోయింది. అప్ప‌టి నుంచి మంచి క‌థ‌, పాత్ర కుదిరితే ఖ‌చ్చితంగా తెలుగులో సినిమా చేస్తాన‌ని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పుకుంటూ వ‌చ్చిన సూర్య ఎట్ట‌కేల‌కు తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా తెలిసింది.

ఈ మూవీని టాలీవుడ్ క్రేజీ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ యువీ క్రియేష‌న్స్ నిర్మించ‌నుంద‌ట‌. తెలుగులో `శౌర్యం` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారి త‌మిళంలో హీరో అజిత్ తో `వీరుమ్` నుంచి `విశ్వాసం` వ‌ర‌కు నాలుగు సినిమాల‌ని తెర‌కెక్కించి ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న సిరుతై శివ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ట‌.

త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం హీరో సూర్య క్రేజీ డైరెక్ట‌ర్ బాల ద‌ర్శ‌కత్వంలో `వ‌నాంగాన్‌` మూవీలో న‌టిస్తున్నారు. `అచ‌లుడు` పేరుతో ఈ మూవీని తెలుగులోనూ విడుద‌ల చేయ‌నున్న విష‌యం తెలిసిందే.