Begin typing your search above and press return to search.
'సింగం' కాంబో కత్తి ఫ్రాంఛైజీతో?
By: Tupaki Desk | 2 March 2020 6:30 AM GMTభారీ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ హరి. కోలీవుడ్ డైరెక్టర్లలో యాక్షన్ ని పీక్స్ లో చూపించడం హరికే చెల్లింది. అలాంటి డైరెక్టర్ కి హైఎనర్జీ స్టార్ సూర్య తోడైతే యాక్షన్ ఇంకే స్థాయిలో ఉంటుందో సింగం సిరీస్ తో క్లారిటీ వచ్చేసింది. గతంలో ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన `సింగం`..`సింగం-2` చిత్రాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ని పతాకస్థాయిలో చూపించారు. కాప్ సూర్య సింగంలా ప్రత్యర్ధుల పై దాడి చేసే సన్నివేశాల్ని సినిమాకే హైలైట్ గా తీర్చిదిద్దారు. `సింగం-3` రొటీన్ కంటెంట్ తో తెరకెక్కడంతో అభిమానులకు అంతగా రుచించలేదు. దీంతో సింగం ప్రాంచైజీ కి తాత్కాలికంగా పుల్ స్టాప్ పడిపోయింది. మరోసారి యాక్షన్ ని సరికొత్త స్థాయిలో చూపించడానికి ఈ జోడీ రెడీ అవుతోంది.
`అరువా` అనే టైటిల్ తో మరో యాక్షన్ ఎంటన్ టైనర్ కి రంగం సిద్ధమవుతోంది. సూర్య కథానాయకుడిగా నటించననున్న 39వ చిత్రమిది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. టైటిల్ విషయానికి వస్తే అరువా అంటే తమిళ్ లో కత్తి అని అర్ధం. టైటిల్ ని బట్టి సినిమా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని క్లారిటీ వచ్చేసింది. ఇక కత్తులతో సావాసం..ఆయుధ పూజ అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే అరువాలో ఫైట్స్ పరంగా ఇంకాస్త ఆ డోస్ ఎక్కువగా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఎప్పుడు సెట్స్ కు వెళుతుంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
గతంలో కత్తి టైటిల్ తో మురగదాస్ బ్లాక్ బస్టర్ తీశారు. విజయ్ నటించిన ఈ చిత్రం కోలీవుడ్ లో రికార్డులు తిరగరాసింది. 100 కోట్ల వసూళ్లతో దళపతి కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచింది. ఆ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి `ఖైదీ నంబర్150` పేరుతో వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేశారు. ఏకంగా 150 కోట్లు కొల్లగొట్టారు. మరి సూర్య కత్తికి ఎంత పదునుందో... ఏ లెవల్లో సానబడుతున్నారో చూడాలి.