Begin typing your search above and press return to search.
చాన్నాళ్ల తర్వాత పారితోషికం భారీగా పెంచిన స్టార్
By: Tupaki Desk | 23 Nov 2020 2:30 AM GMTతమిళ స్టార్ హీరోల పారితోషికాలు వారి సక్సెస్ లపై ఆదారపడి ఉంటాయి. విజయ్ వంటి సూపర్ స్టార్ ఏకంగా వంద కోట్ల వరకు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన సక్సెస్ ల వల్ల ఆ స్థాయి పారితోషికంను అందుకుంటున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పారితోషికం విషయంలో సూర్య ఇతర హీరోలతో పోల్చితే కాస్త వెనుకబడ ఉన్నాడు అనడంలో సందేహం లేదు. కాని తాజాగా దక్కిన ఆకాశమే నీ హద్దురా సినిమా సక్సెస్ తో సూర్య కూడా తన పారితోషికంను చాలా కాలం తర్వాత భారీగా పెంచాడు అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈమద్య కాలంలో సూర్య కు సక్సెస్ అనేది అందని ద్రాక్ష మాదిరిగా నిలిచింది. ఎట్టకేలకు సుధ కొంగర దర్శకత్వంలో సూరారై పోట్రు సినిమాతో సక్సెస్ దక్కించుకున్నాడు. ఓటీటీలో విడుదలైన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే సినిమా థియేటర్లలో విడుదల అయ్యి ఉంటే సూర్య క్రేజ్ ఇంకా పెరిగేది అనడంలో సందేహం లేదు. సూర్య తన సినిమాలను తానే ఇటీవల నిర్మించుకుంటున్నాడు.
సూరారై పోట్రు సినిమా సక్సెస్ తో బయట నిర్మాతలు భారీ ఆఫర్ లతో అడ్వాన్స్ లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అందుకే సూర్య తన పారితోషికంను భారీగా పెంచాడనే టాక్ వినిపిస్తుంది. సక్సెస్ కు తగ్గట్లుగా పారితోషికం పెంచడం కొత్తేం కాదు. కనుక సూర్య పారితోషికం పెంచినా కూడా నిర్మాలు ఆయన్ను కోరుతున్నారు. ఇప్పటికే ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సూర్యకు అడ్వాన్స్ ఇచ్చిందని.. వచ్చే ఏడాది ఆ సినిమా మొదలు అవ్వబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.