Begin typing your search above and press return to search.
ఓటీటీలోకి సూర్య 'ఈటీ'.. రిలీజ్ డేట్ లాక్?!
By: Tupaki Desk | 17 March 2022 6:30 AM GMTఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుని ఫుల్ జ్యోష్‌లో ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. మరో హిట్‌ను సొంతం చేసుకునేందుకు 'ఈటీ (ఎవరికీ తలవంచడు)'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. వినయ్ రాయ్, సత్యరాజ్, మధుసూధన్ రావు, జయప్రకాష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే మార్చి 10న తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. సినిమా కథ మొత్తం పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌లోనే సాగుతుంది.
సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నించేలా ఈ సినిమాను రూపొందించారు. తీసుకున్న పాయింట్ బలంగానే ఉన్నా.. దాన్ని ప్రజెంట్ చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు.
లాయర్‌గా సూర్య మాత్రం తన నటనతో అదరగొట్టారు. అయితే సినిమా పరమ రొటీన్ గా ఉందని మూవీ లవర్స్ పెదవి విరిచారు. పైగా విడుదలకు ముందు సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం, మార్చి 11న ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్' రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈటీ బొక్కబోర్లా పడింది. ఇకపోతే కరోనా వచ్చిన తర్వాత థియేటర్స్‌లో విడుదలైన చిత్రాలు.. మళ్లీ ఓటీటీలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యలోనే 'ఈటీ' కూడా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. సన్ నెక్స్ట్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు కలిసి ఈటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సాలిడ్ రేటుకు సొంతం చేసుకున్నాయి.
అయితే ఇప్పుడీ చిత్రాన్ని ఏప్రిల్ 1న స్ట్రీమింగ్ చేయాలని సదరు సంస్థలు డేట్ లాక్ చేసినట్లు తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఈ మధ్య కొన్ని కొన్ని చిత్రాలు బిగ్ స్క్రీన్‌పై ఫ్లాప్ అయినా ఓటీటీలో హిట్ అవుతున్నాయి. ఇలాగైనా ఈటీ మంచి విజయం సాధిస్తుందేమో చూడాలి.