Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ : సస్పెన్స్ లేకుండా షాకింగ్ ఎలిమినేషన్
By: Tupaki Desk | 30 Oct 2022 4:51 AM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నుండి మరో షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. సాధారణంగా ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం శనివారం ఎపిసోడ్ లోనే ఎలిమినేషన్ జరిగింది. అంతే కాకుండా ఒకొక్కరిని సేవ్ చేస్తూ చివర్లో మిగిలిన వారిని యూ ఆర్ ఎలిమినేటెడ్ అంటూ నాగార్జున ప్రకటిస్తాడు. కానీ ఈసారి డైరెక్ట్ గా సూర్య యూఆర్ ఎలిమినేటెడ్ అంటూ ప్రకటించాడు.
ఆర్జే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. మొదట టాప్ 5 లేదా 6 లో ఇతడు ఉంటాడని అంతా బలంగా మాట్లాడుకున్నారు. అతడి యొక్క ఆట తీరు మరియు ఇతరుల పట్ల వ్యవహరించే తీరు గురించి ప్రముఖంగా చర్చ జరిగేది. కానీ ఈ మధ్య కాలంలో ఈయన పులిహోర వేశాలు మరీ ఎక్కువ అయ్యాయి.. అవుతున్నాయి అంటూ ప్రేక్షకులు భావించారు.
తెలుగు బిగ్ బాస్ లో ఇలాంటి ఎలిమినేషన్స్ జరగడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సీజన్ 6 కి పెద్దగా ప్రేక్షకుల ఆధరణ రావడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో బిగ్ బాస్ నిర్వాహకులు ఏదో విధంగా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి షాకింగ్ ఎలిమినేషన్స్ చేస్తున్నారా అంటూ చర్చ జరుగుతోంది.
ఇక శనివారం ఎపిసోడ్ లో పూర్తిగా చేపలు పట్టే టాస్క్ గురించి చర్చ జరిగింది. ముఖ్యంగా గీతూ యొక్క ఆట తీరును నాగార్జున తీవ్రంగా తప్పుబట్టాడు. నీకు బాగా ఓవర్ యాక్షన్ అవుతుంది.. నీవు తగ్గించుకుంటే బాగుంటుంది అన్నట్లుగా గీతూ ను నాగార్జున హెచ్చరించాడు అంటూ సోషల్ మీడియాలో గీతూ గురించి ట్రోల్స్ వస్తున్నాయి.
శనివారం ఎపిసోడ్ లోనే ఎలిమినేషన్ జరిగి పోయింది. కనుక ఆదివారం ఎపిసోడ్ లో ఏమైనా సస్పెన్స్ ఉంటుంది... అసలు సూర్య ఎలిమినేట్ అవ్వడం నిజమేనా లేదంటే సీక్రెట్ రూం లో ఉంచబోతున్నారా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. నేడు మరో ఎలిమినేషన్ ఉంటే కచ్చితంగా షో అదిరి పోతుంది అంటూ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.