Begin typing your search above and press return to search.
సూర్య ఫ్యాన్స్ రచ్చ.. తగలబడ్డ థియేటర్
By: Tupaki Desk | 8 Jun 2022 10:50 AM GMTతమిళనాట హీరోలకు ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ఫ్యాన్స్ తో పోల్చితే ఒకింత ఎక్కువ డేంజర్ గా తమిళ ఫ్యాన్స్ కనిపిస్తూ ఉంటారు. అక్కడ అభిమానుల మధ్య గొడవలు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆ మధ్య అభిమానుల మధ్య గొడవలు జరిగి హత్యలకు కూడా దారి తీసిన సందర్బాలు ఉన్నాయి. తాజాగా సూర్య అభిమానులు చేసిన రచ్చ తో థియేటర్ తగలబడింది.
పుదుచ్చేరిలోని ఓ థియేటర్ లో సూర్య అభిమానులు విక్రమ్ సినిమాకు వెళ్లారు. సినిమా క్లైమాక్స్ లో సూర్య ఎంట్రీ ఇవ్వగానే అభిమానులు లేచి స్క్రీన్ వద్దకు వెళ్లారు. అక్కడ ఆయన కనిపించిన వెంటనే థియేటర్ దద్దరిలేలా హడావుడి చేశారు. అందులో కొందరు ఏకంగా క్రాకర్స్ కాల్చి తమ అభిమానం చూపించాలని భావించారు. క్రాకర్స్ కాల్చడం తో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
థియేటర్ లో క్రాకర్స్ కాల్చడంతో సీట్లకు నిప్పు అంటుకుంది. వెంటనే స్క్రీన్ కు కూడా నిప్పు అంటుకుంది. స్క్రీన్ తగలబడటంతో పాటు ఫర్నీచర్ మరియు స్పీకర్ లు ఇంకా ఏసీకి సంబంధించిన సామాగ్రి మొత్తం కూడా తగులబడింది. సమాచారం అందుకున్న పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వెంటనే ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే నష్టం జరిగి పోయింది.
కేసు నమోదు చేసిన పోలీసులు క్రాకర్స్ తెచ్చిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చతో విక్రమ్ సినిమా గురించి మరింతగా హడావుడి మరింతగా ఉంది.
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ చాలా కాలం తర్వాత ఒక భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఈ సినిమా తో దక్కించుకున్నాడు. సూర్య సినిమా చివర్లో మూడు నాలుగు నిమిషాలు కనిపించి రచ్చ చేశాడు. కమల్.. సూర్యలతో పాటు ఈ సినిమా లో విజయ్ సేతుపతి మరియు ఫాహద్ ఫాసిల్ లు కూడా ఉన్నారు.
దాంతో రచ్చ రచ్చ గా ఈ సినిమా ఆడుతోంది. తమిళనాట రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఇప్పటికే నమోదు చేసినట్లుగా సమాచారం అందుతోంది. అంతా సాఫీగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో పుదుచ్చేరిలో ఇలా సంఘటన జరగడం విచారకరం.