Begin typing your search above and press return to search.
వావ్.. ఆస్కార్ అవార్డుల రేసులో సూర్య
By: Tupaki Desk | 27 Jan 2021 9:00 AM ISTగత ఏడాది లాక్ డౌన్ టైంలో దక్షిణాది ప్రేక్షకులకు గొప్ప ఉపశమనాన్ని అందించిన సినిమాల్లో ఆకాశం నీ హద్దురా ఒకటి. ఇండియాలో ఓటీటీల్లో రిలీజైన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ ఇదే అని కూడా చెప్పవచ్చు. థియేటర్లలో వచ్చి ఉంటే ఇంకా పెద్ద విజయం సాధించేది కానీ.. ఓటీటీలో ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. సూర్య కెరీర్ బెస్ట్ అనదగ్గ పెర్ఫామెన్స్ ఇవ్వగా.. తెలుగమ్మాయి అయిన సుధ కొంగర ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవితాన్ని అద్భుత రీతిలో ప్రెజెంట్ చేసి ప్రశంసలందుకుంది. సాంకేతికంగా కూడా ఈ సినిమా ఉన్నత స్థాయిలో ఉండి అప్లాజ్ అందుకుంది. ఇప్పుడీ సినిమా ఆస్కార్ అవార్డుల రేసులో నిలవడం విశేషం.
మామూలుగా ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారత్ నుంచి ఒక సినిమాను ఎంట్రీగా పంపిస్తారు. ఐతే ఆకాశం నీ హద్దురాను అలా కాకుండా నేరుగా జనరల్ కేటగిరిలో సొంతంగా చిత్ర బృందం నామినేషన్‌కు పంపింది. ఉత్తమ నటుడిగా సూర్య, ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి, ఉత్తమ దర్శకురాలిగా సుధ, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ అవార్డుల రేసులో నిలిచారు. ప్రస్తుతం ఆస్కార్ స్క్రీనింగ్ రూంలో ఈ చిత్రం ప్రదర్శితమవుతోంది. నామినేషన్ల తుది జాబితాలో ఈ సినిమా నిలుస్తుందో లేదో చూడాలి. ఐతే ఒక ఇండియన్ సినిమా ఇలా జనరల్ కేటగిరిలో పోటీ వరకు వెళ్లడం కూడా గొప్పే అని విశ్లేషకులు అంటున్నారు. ఏదో ఒక విభాగంలో చివరి పోటీలో ఈ సినిమా నిలిచినా దాన్ని ఓ ఘనతగానే భావించాలి. మరి సూర్య సినిమా ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.