Begin typing your search above and press return to search.
స్టార్ హీరో సూర్యని బ్యాన్ చేస్తామంటున్నారు!
By: Tupaki Desk | 31 Oct 2021 2:30 PM GMTకరోనా తగ్గు ముఖం పట్టింది. అన్ని రాష్ట్రాల్లో దాదాపు థియేటర్లు అన్ లాక్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే పూర్తిస్థాయిలో థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. తమిళనాడు లో కూడా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. అయితే ఓటీటీల హవా మాత్రం ఎక్కడా తగ్గలేదు. థియేటర్ రిలీజ్ కి పోటీగా ఓటీటీలోనూ సినిమాలు పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. ఈ ఒరవడి టాలీవుడ్ కంటే కోలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తోంది. ఓవైపు డిస్ట్రిబ్యూటర్లు..ఎగ్జిబిటర్లు థియేటర్లో రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నా...స్టార్ హీరోలు మాత్రం ఓటీటీకే మొగ్గు చూపుతున్న సన్నివేశం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ధనుష్..సూర్య లాంటి హీరోలకు ఓటీటీ స్టార్లుగా ముద్ర పడిపోయింది. కరోనా రాక మొదలైన దగ్గర నుంచి ఈ ఇద్దరు హీరోలు ఓటీటీ రిలీజ్ లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ధనుష్ నటించిన కొన్ని సినిమాలు వరుసగా ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా సూర్యపై ఆ ఇంపాక్ట్ బలంగా పడింది. సూర్య కథానాయకుడిగా నటించిన `జై భీమ్` నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఓటీటీ లోకి వస్తోంది. అంతకు ముందు సూర్య నటించిన `ఆకాశమే నీ హద్దురా` చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ లోనే రిలీజ్ అయింది.
అయితే ఈ రెండు చిత్రాలను సూర్య-జ్యోతిక సొంత బ్యానర్ లో నిర్మించారు. ఈనేపథ్యంలో రిలీజ్ వాళ్ల ఇష్టం మేరకు జరిగింది. కరోనా తగ్గిన తర్వాత కూడా సూర్య కొత్త సినిమా `జైభీమ్ `ఓటీటీలో రిలీజ్ అవ్వడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సూర్య చిత్రాల్ని కూడా భవిష్యత్ లో థియేటర్ రిలీజ్ అంటే బ్యాన్ చేయాలనే నినాదం కోలీవుడ్ లో తెరపైకి వస్తోంది. అయితే ఈ చిత్రాల అగ్రిమెంట్ కరోనా పీక్స్ టైమ్ లో జరిగింది. ఓటీటీ లతో ఒప్పందాల్ని కష్టకాలంలో ఏం చేయాలో పాలుపోని సన్నివేశంలో మాత్రమే జరిగిందని సూర్య టీమ్ వాదిస్తోంది.
24 ఏళ్ల సూర్య కెరీర్ లో వెరీ స్పెషల్!
`జై భీమ్` చిత్రం సూర్య కెరీర్ లోనే చాలా ప్రత్యేకమైనది. 1990 లో తమిళనాడు లో జరిగిన కొన్ని యధార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని థా.సె జ్ఞాన్ వేల్ తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాల్ని క్రియేట్ చేసాయి. ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో `జైభీమ్` రెట్టించిన అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.
సూర్య మాట్లాడుతూ-``24 ఏళ్ల కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసాను. అయినా ఏ రోజు నా అభిమానులు నన్ను వదల్లేదు. 24 ఏళ్ల నుంచి నాతో పాటే అభిమానులు ప్రయణం చేస్తున్నారు. నాపై ఇంత నమ్మకం ఉంచినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వారికి కేవలం నా నుంచి మంచి సినిమాలు ఇచ్చి వారిని సంతోషంగా ఉంచడం తప్ప నేను చేసిందేంలేదు. సినిమా అనేది మా ఇద్దరి మధ్య ఇంత గొప్ప బంధాన్ని ఏర్పరించింది. నా కెరీర్ లో మోస్ట్ ఛాలెంజింగ్ సినిమాలలో ఇది ఒకటి. లాయర్ చంద్ర పాత్ర చాలెంజింగ్ గా ఉంటుంది. నా గత్ చిత్రాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కమర్శియల్ అంశాలు పెద్దగా ఉండవు. కథలో పాత్రల ఎమోషన్స్ మాత్రమే కనిపిస్తాయి. ప్రతీ పాత్ర దేనికది ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరినీ కదిలించే చిత్రమిది. ఇది నాకు చాలకాలం పాటు గుర్తిండిపోయే సినిమా. ఈ సినిమా ని ఓ బాధ్యతగా భావించి చేసాను` అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ రిలీజ్ అవుతుంది. ఇందులో ప్రకాశ్ రాజ్.. రావు రమేష్..రజిషా విజయన్..మణికందన్.లిజో మోల్ జోస్ కీలక పాత్ర లు పోషించారు.