Begin typing your search above and press return to search.

హీరోయిన్ క‌ల్యాణి విడాకులు?

By:  Tupaki Desk   |   25 Jun 2016 4:20 AM GMT
హీరోయిన్ క‌ల్యాణి విడాకులు?
X
మ‌ల‌యాళం హీరోయిన్ క‌ల్యాణ్ అప్ప‌ట్లో టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. శేషు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన‌ క‌ల్యాణి త‌ర్వాత చాలా సినిమాల్లో న‌టించింది. ముఖ్యంగా ఔను వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు చిత్రం ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. ఆ స‌క్సెస్ తో టాలీవుడ్ లో అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. జ‌గ‌ప‌తిబాబు - ర‌వితేజ‌ - వెంక‌టేష్ వంటి స్టార్ హీరోల స‌ర‌స‌న ఆడిపాడింది. అప్ క‌మింగ్ హీరోయిన్ల పోటీ ఎక్కువ అవ్వ‌డంతో కాల క్ర‌మేణా అవ‌కాశాలు త‌గ్గాయి. ఈ నేప‌థ్యంలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సెకెండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.

త‌ర్వాత స‌త్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన సూర్య‌కిర‌ణ్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. అనంత‌రం ఇద్ద‌రి కెరీర్ కూడా ఆశించినంత‌గా సాగ‌లేదు. దీంతో పూర్తిగా వేరే రంగాల్లో బిజీ అయ్యారు. టాలీవుడ్ లో ఆద‌ర్శ దంప‌తుల‌కుగా కీర్తిని గ‌డించారు. అయితే తాజాగా వీళ్లిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు చోటుచేసుకున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జంట విడాకులు తీసుకోవ‌డానికి నిర్ణ‌యించుకున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ గుట్టుచ‌ప్పుడు కాకుండా ఉన్న ఈ జంట విష‌యంలో ఒక్క‌సారిగా ఇలాంటి వార్త రావ‌డంతో టాలీవుడ్ ఆశ్య‌ర్యానికి గుర‌వుతుంది. ఏది ఏమైనా ఇన్నాళ్లు అన్యోన్యంగా క‌లిసి ఉన్న జంట విడిపోతుంద‌న్న వార్త ప్రేక్ష‌కుల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. అయినా సెల‌బ్రిటీల జీవితంలో ఇలాంటివి చాలా కామ‌న్ గా జ‌రుగుతూనే ఉంటుంటాయి లేండి.