Begin typing your search above and press return to search.

తెలుగు మార్కెట్ కోసం కాపుకాసిన సింగం

By:  Tupaki Desk   |   12 Nov 2019 1:30 AM GMT
తెలుగు మార్కెట్ కోసం కాపుకాసిన సింగం
X
త‌మిళ స్టార్ హీరో సూర్య గ‌త కొంత‌కాలంగా కెరీర్ ప‌రంగా స్ట్ర‌గుల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌జినీ డేస్.. సింగం డేస్ తిరిగి రావాల‌ని అత‌డు ఎంత క‌ల‌గ‌న్నా అది సాధ్య‌ప‌డ‌డం లేదు. మునుప‌టితో పోలిస్తే తెలుగులో యువ హీరోల కాంపిటీష‌న్ అంత‌కంత‌కు పెరిగింది. లోక‌ల్ హీరోల స్ట్రెంగ్త్ కూడా పెర‌గ‌డం మ‌న ద‌ర్శ‌కులు తీస్తున్న సినిమాల్లో స్ట‌ఫ్ పెర‌గ‌డంతో ఆ ప్ర‌భావం కాస్తా పొరుగు భాష‌ల నుంచి వ‌చ్చే హీరోల‌పై ప‌డుతోంది. ఈ స‌న్నివేశ‌మే సూర్య లాంటి స్టార్ కి మైన‌స్ గా మారింది. ఇక అత‌డు ఎంపిక చేసుకుంటున్న కాన్సెప్టులేవీ తెలుగు ఆడియెన్ కి ఎక్క‌క‌పోవ‌డంతో వ‌రుస‌గా ఫ్లాపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక త‌మిళ్- తెలుగు ద్విభాషా చిత్రాల‌కు స‌రిప‌డే క‌థాంశాల కోసం సూర్య నానా తంటాలు ప‌డాల్సి రావ‌డం తెలిసిందే.

మొన్న‌టికి మొన్న రిలీజైన `కాప్ప‌న్` త‌న‌ను సేవ్ చేస్తుంద‌ని సూర్య ఆశించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని ఫ్లాప్ ని ఎదుర్కొంది. తెలుగు ఆడియెన్ ని ఎంత‌మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోవ‌డం నిరాశప‌రిచింది. తిరిగి సింగంలా మార్కెట్ పై గురి పెట్టాల‌ని చూసినా కుద‌ర‌లేదు. ఇక ఇలాంటి స‌న్నివేశాన్నే ఎదుర్కొన్న సూర్య సోద‌రుడు కార్తీ మాత్రం వ‌రుస‌గా రెండు హిట్లు కొట్టి కంబ్యాక్ అయ్యాడు. ఇంత‌కుముందు ఖాకీ చిత్రంతో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకున్న కార్తీ లేటెస్టుగా `ఖైదీ` చిత్రంతో క్లీన్ హిట్టు కొట్టాడు. ఖాకీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మై పేరు తెస్తే.. ఖైదీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లతో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని రెవెన్యూ తెచ్చింద‌ని ట్రేడ్ విశ్లేషించింది. దీంతో కార్తీకి తెలుగు రాష్ట్రాల మార్కెట్ కి జ‌వ‌స‌త్వాలు వ‌చ్చిన‌ట్టు అయ్యింది.

ఇక త‌మ్ముడు నెగ్గుకొచ్చాడు కాబ‌ట్టి ఈసారి త‌న‌వంతు అని అన్న‌ సూర్య భావిస్తున్నాడ‌ట‌. తిరిగి సింగం డేస్ ని తేవాల‌ని .. తెలుగు మార్కెట్లో బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని క‌సిగా ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. అందుకే ఈసారి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో తెలుగు ఆడియెన్ ముందుకు వ‌స్తున్నాడు. 2020లో సూర్య రెండు భారీ చిత్రాలతో అభిమానుల ముందుకు రానున్నాడు. సూర‌రై పొట్రు .. సూర్య 39 ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్నాయి. సూర‌రై పొట్రు ఓ ఆస‌క్తిక‌ర‌ బ‌యోపిక్. ఎయిర్ డెక్క‌న్ ఫౌండ‌ర్ కెప్టెన్ జీఆర్ గోపినాథ్ జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కుతోంది. సుధ కొంగ‌ర ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే సూర్య న‌టించ‌నున్న 39వ‌ చిత్రానికి విశ్వాసం ఫేం (ద‌రువు) శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ రెండిటిపైనా సూర్య భారీగా ఆశ‌లు పెట్టుకున్నాడు. మ‌రోవైపు వైఫ్ జ్యోతిక‌ను సూర్య అటు త‌మిళ్ స‌హా తెలుగులోనూ ప్ర‌మోట్ చేస్తున్నాడు. జ్యోతిక న‌టించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు అన్నిచోట్లా క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. త‌మిళంలో బాక్సాఫీస్ హిట్లు ద‌క్కుతున్నాయి. అందుకే జ్యోతిక తెలుగు మార్కెట్ పైనా సీరియ‌స్ గానే తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇక త‌దుప‌రి జాక్ పాట్ చిత్రంతో స‌త్తా చాటేందుకు జ్యోతిక‌ను ప్రిపేర్ చేస్తున్నాడు సూర్య‌. ఈ చిత్రంలో జ్యోతిక‌- రేవ‌తి జోడీ కాప్ పాత్ర‌లు ఆక‌ట్టుకోనున్నాయ‌ట‌. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 21న రిలీజ్ చేస్తున్నారు.