Begin typing your search above and press return to search.
అప్పుకు స్టార్ హీరో కన్నీటి నివాళి
By: Tupaki Desk | 5 Nov 2021 4:30 PM GMTకన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి నుండి ఆయన అభిమానులు కోలుకోలేక పోతున్నారు. నిన్న మొన్నటి వరకు మాలో ఒకడిగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా మృతి చెందడంను ఇండస్ట్రీ వర్గాల వారు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. సొంత ఇంట్లో మనిషి చనిపోయినట్లుగా ఎంతో మంది పునీత్ రాజ్ కుమార్ మృతికి కన్నీరు పెట్టుకున్న విషయం తెల్సిందే. పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల తెలుగు సినిమా ప్రముఖులు స్పందించినంతగా కోలీవుడ్ హీరోలు స్పందించలేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో ఎవరికి వీలు కలిగినప్పుడు వారు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్ద నివాళ్లు అర్పిస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య బెంగళూరు వెళ్లి అప్పు సమాధి వద్ద గజమాల అలంకరించి ఘన నివాళి అర్పించారు.
స్వయంగా తానే సమాధి వద్దకు మాలను తీసుకుని వెళ్లి అలంకరించిన సూర్య కొన్ని సెకన్ల పాటు అలాగే ఉండి పోయాడు. అలా వంగుని కన్నీరు పెట్టుకున్న సూర్య వెంటనే తేరుకుని కన్నీళ్లు తూడ్చుకుంటే అక్కడ నుండి బయటకు వచ్చాడు. కన్నీటి నివాళి అర్పించిన సూర్య ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సమంయలో కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. సూర్యను వెంట పెట్టుకుని శివ రాజ్ కుమార్ స్వయంగా పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో శివ రాజ్ కుమార్ కూడా ఎమోషనల్ అయ్యారు. కంఠీరవ స్టూడియోలో రాజ్ కుమార్ తండ్రి సమాధి పక్కనే పునీత్ రాజ్ కుమార్ సమాధిని ఏర్పాటు చేశారు. అక్కడికి ప్రతి రోజు వేల సంఖ్యలో జనాలు చేరుకుని అప్పుకు నివాళ్లు అర్పిస్తున్నారు.
సూర్య కొన్ని కారణాల వల్ల అప్పు చనిపోయిన సమయంలో బెంగళూరుకు వెళ్లలేక పోయారు. ఆ తర్వాత జై భీమ్ సినిమా విడుదల ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. అందుకే సమయం చూసుకుని ఇప్పుడు సూర్య వెళ్లి బెంగళురులో అప్పు సమాధి వద్ద నివాళ్లు అర్పించారనే మీడియాలో కథనాలు వస్తున్నాయి. జై భీమ్ సినిమా తో సూర్య నటుడిగా మరోసారి తన సత్తా చాటాడు. అద్బుతమైన నటనతో పాటు ఆకట్టుకునే ఒక పాయింట్ ను దక్కించుకుని సినిమా చేశారంటూ సూర్యకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలాంటి సామాజిక బాధ్యతతో సినిమాలు చేయడం కేవలం సూర్యకే చెల్లిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.