Begin typing your search above and press return to search.

స్టార్ హీరో సూర్య‌కు క‌రోనా.. ఇంకా జాగ్ర‌త్త అవ‌స‌రం!

By:  Tupaki Desk   |   8 Feb 2021 9:00 AM IST
స్టార్ హీరో సూర్య‌కు క‌రోనా.. ఇంకా జాగ్ర‌త్త అవ‌స‌రం!
X
క‌రోనా మ‌హ‌మ్మారీ నుంచి ప్ర‌పంచం ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతోంది. అమెరికా-బ్రిట‌న్ లాంటి చోట ప్ర‌మాద తీవ్ర‌త త‌గ్గ‌క‌పోయినా.. ఇండియాలో వేగంగానే క‌ట్ట‌డి అయ్యింది. క‌రోనా నియంత్ర‌ణ‌లో రోగ‌నిరోధ‌క శ‌క్తి కీల‌క పాత్ర‌ను పోషించింద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ భ‌ద్ర‌త‌ను పెంచి ధైర్యాన్ని నింపుతోంది.

ఇక క‌రోనా మ‌హ‌మ్మారీ సెల‌బ్రిటీల్ని అదేప‌నిగా వెంటాడిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి.. రామ్ చ‌ర‌ణ్ స‌హా ప‌లువురు హీరోల‌కు పాజిటివ్ వ‌చ్చింది. అనంత‌రం చికిత్స ద్వారా వీరంతా కోలుకున్నారు. ఇప్పుడు స్టార్ హీరో సూర్య‌కు క‌రోనా పాజిటివ్ అని తెలిసింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా త‌న అభిమానుల‌కు వెల్లడించారు.

``మ‌న‌మంతా సాధార‌ణ స్థితికి వ‌చ్చేశామ‌ని అనుకోవ‌ద్దు. ఇంకా క‌రోనా తీవ్ర‌త ఉంది. దీనికి భ‌య‌ప‌డ‌న‌క్క‌ర్లేదు. కానీ జాగ్ర‌త్త‌లు పాటించాల్సిన అవ‌స‌రం ఉంది`` అని సూర్య అన్నారు. ఆకాశ‌మే నీ హ‌ద్దురా చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న సూర్య ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు.