Begin typing your search above and press return to search.

మరో బయోపిక్ లో సూర్య

By:  Tupaki Desk   |   1 March 2023 8:00 PM GMT
మరో బయోపిక్ లో సూర్య
X
జై భీమ్, ఆకాశం నీ హద్దురా సినిమాలతో రెండు రియల్ లైఫ్ హీరోల పాత్రలని తమిళ్ స్టార్ హీరో సూర్య పోషించిన సంగతి తెలిసిందే. రెండు భిన్నమైన నేపధ్యాలు ఉన్న కథలు. జైభీమ్ లో ఒక చంద్రు అనే లాయర్ పాత్రలో మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా కనిపించాడు. ఇక ఆకాశం నీ హద్దురా సినిమాలో ఎయిర్ డెక్కన్ ఎయిర్ లైన్స్ అధినేత గోపీనాథ్ పాత్రలో సూర్య నటించాడు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని నేషనల్ అవార్డులని సైతం గెలుచుకున్నాయి.

ఓ వైపు కమర్షియల్ హీరోగా ఫిక్షనల్ స్టోరీస్ చేస్తూనే, మరో వైపు నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకునే విధంగా రియల్ లైఫ్ కథలని కూడా సూర్య చేస్తూ ఉండటం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. ప్రస్తుతం డైరెక్టర్ శివతో ఓ ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని పీరియాడిక్ జోనర్ లో చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సూర్య మరో బయోపిక్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

బ్రిటానియా బిస్కెట్స్ అధినేత రంజన్ పిళ్ళై జీవిత కథని తెరపైకి తీసుకొచ్చేందుకు మలయాళీ దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.

అలాగే ఈ కథపై చాలా రీసెర్చ్ చేసి సిద్ధం చేసిన పృథ్వీరాజ్ ఇప్పుడు ఆ సినిమాలో లీడ్ రోల్ కోసం చాలా మంది హీరోల పేర్లు పరిశీలించినట్లు తెలుస్తుంది. ఇక ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ తమిళ్ స్టార్ సూర్య దగ్గరకి వచ్చిందని తెలుస్తుంది.

ఇక సూర్య కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ సూర్య 43వ చిత్రంగా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయనే మాట కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తుంది. బ్రిటానియా బిస్కెట్స్ అంటే దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.

ఆ బిస్కెట్స్ ని ప్రత్యేకమైన బ్రాండ్ వేల్యూ కూడా మార్కెట్ లో ఉంది. ఈ నేపధ్యంలో రంజన్ పిళ్ళై బయోపిక్ ని పాన్ ఇండియా స్థాయిలోనే తీసుకొచ్చేందుకు పృథ్వీరాజ్ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.