Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: ఫైర్ బ్రాండ్ కాంతం
By: Tupaki Desk | 26 March 2019 10:33 AM GMTమెగా డాటర్ నీహారిక టైటిల్ రోల్ లో రాహుల్ విజయ్ హీరోగా నటించిన సూర్యకాంతం ట్రైలర్ ఇందాక విడుదలైంది. సింపుల్ గా ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఓ వెరైటీ థీమ్ ని దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే కథను దాదాపుగా ఇందులోనే రివీల్ చేసేశారు. అభి(రాహుల్ విజయ్)కు ఒక యాక్సిడెంట్ లాంటి సంఘటనలో సూర్యకాంతం(నీహారిక) పరిచయమవుతుంది. నిలువెల్లా చలాకీతనం ముక్కుసూటితనం నింపుకున్న సూర్యకాంతం అభికి అంతు చిక్కదు. తన మీద ఇష్టాన్ని పెంచుకుంటాడు.
కొంత గ్యాప్ తర్వాత అభికి పూజ(పెర్లెన్ బెసానియా)తో ప్రేమ మొదలవుతుంది. అనూహ్యంగా సూర్యకాంతం వెనక్కు వస్తుంది. ఇప్పుడు అభి ఇద్దరి మధ్యా ఇరుక్కు పోతాడు. సూర్యకాంతం పూజాలు పోటీ పడి అభిని ఒకరికి తెలియకుండా మరొకరు తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తారు. మరి ఈ ప్రేమ యుద్ధంలో సూర్యకాంతం ఎలా నెగ్గింది అనేదే కథ
ఎంటర్ టైన్మెంట్ కి ప్రాధాన్యత ఇస్తూనే దర్శకుడు ప్రణీత్ ఎంచుకున్న కాన్సెప్ట్ యూత్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా సూర్యకాంతం పాత్రను తీర్చిదిద్దన తీరు ఏదైనా సరే అనుకున్నది వెంటనే చేసే తత్వంతో సింక్ చేసిన తీరుకు నీహారిక పర్ఫెక్ట్ గా పర్ఫార్మ్ చేసింది.
రాహుల్ విజయ్ యాప్ట్ గా ఉన్నాడు. కొత్తమ్మాయి పెర్లిన్ క్యూట్ గా ఉంది. శివాజీ రాజా హీరో తండ్రిగా సత్య అభి ఫ్రెండ్ గా కామెడీ పార్ట్ ని తీసుకున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం మ్యాచ్ అయ్యింది. మొత్తానికి నీహారిక బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథగా సూర్యకాంతం సరైన టైంలో వస్తున్నట్టు కనిపిస్తోంది. ట్రైలర్ లో చూపించిన కంటెంట్ సినిమా సాంతం ఉంటే మెగా ప్రిన్స్ సిస్టర్ కు మొదటి హిట్టు పడ్డట్టే