Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ మూవీ వాయిదాల పర్వం.. మరో కొత్త డేట్

By:  Tupaki Desk   |   26 Sep 2021 8:30 AM GMT
సూపర్ స్టార్ మూవీ వాయిదాల పర్వం.. మరో కొత్త డేట్
X
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ ని సినిమా గత ఏడాదిలోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ఏడాది అక్టోబర్‌ లో సినిమాను విడుదల చేయాలని భావించారు. కాని మహారాష్ట్రతో పాటు ఇంకా పలు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్ కాలేదు. కనుక బాలీవుడ్ సినిమాలను వాయిదా వేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి సూర్యవంశీ విడుదల వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అక్షయ్‌ కుమార్ సినిమా అంటే మినిమం వంద కోట్లు వసూళ్లు సాధిస్తుంది. సినిమా కనుక సక్సెస్ అయితే వందల కోట్ల రూపాయలను అక్షయ్‌ కుమార్‌ దక్కించుకోగల సత్తా ఉన్న నటుడు. అందుకే ఆయన సినిమా మంచి సమయంలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మళ్లీ వాయిదా వేయడం జరిగింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను నవంబర్ లో దీపావళి కానుకగా విడుదల చేయాలని రోహిత్ శెట్టి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ లో మెల్ల మెల్లగా థియేటర్లు ఓపెన్‌ అవుతాయని.. తద్వారా సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ ముందుకు వస్తారని టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటికే సౌత్ ఇండియాలో సినిమాల సందడి మొదలు అయ్యింది. కనుక ఉత్తరాదిన కూడా అక్టోబర్ లో ఆ సందడి కనిపిస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ సినిమాలు చాలా నష్టపోయాయి. మహా ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ కు అనుమతులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

అక్టోబర్ లో థియేటర్లు ఓపెన్ అయితే నవంబర్ వరకు మళ్లీ సినిమాల సందడి మొదలు అవుతుంది. అందుకే దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తే అన్ని విధాలుగా బాగుంటుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు కరణ్‌ జోహార్ ఒక నిర్మాతగా వ్యవహరించారు. కత్రీనా కైఫ్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మరో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఒక మినీ మల్టీ స్టారర్ గా ఈ సినిమాను బాలీవుడ్‌ మీడియా అభివర్ణిస్తుంది. అందుకే ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని మేకర్స్‌ మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నాయి. సౌత్‌ లో సినిమాకు మంచి రోజులు వచ్చినట్లుగా నార్త్‌ లో కూడా వచ్చే నెలతో మంచి రోజులు రావాలని అందరు ఆశిస్తున్నారు.