Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో చాన్నాళ్ల‌కు 100కోట్లు?

By:  Tupaki Desk   |   9 Nov 2021 2:30 AM GMT
బాలీవుడ్ లో చాన్నాళ్ల‌కు 100కోట్లు?
X
క‌రోనా క్రైసిస్ అల్ల‌క‌ల్లోలం లో బాలీవుడ్ పూర్తి సందిగ్ధావ‌స్త‌లోకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ భాయ్ లాంటివాడే గ‌డ‌గ‌డ‌లాడాడు. క్రైసిస్ నుంచి ప‌రిశ్ర‌మ‌ను బ‌య‌టికి తేలేక‌పోయాడు. కానీ ఇన్నాళ్టికి ఖిలాడీ అక్ష‌య్ కుమార్ ఈ సందిగ్ధ‌త నుంచి బ‌య‌ట‌ప‌డేసే హిట్ ని ఇచ్చాడ‌ని చెప్పాలి. అత‌డు న‌టించిన సూర్యవంశీ డే 3 బాక్స్ ఆఫీస్ అంచనా 30 కోట్లుగా ఉంది. అంటే తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 80 కోట్ల మేర వ‌సూళ్ల‌ను సాధించి తొలి వారాంతానికి గ్యారెంటీగా 100 కోట్లు పైగా వ‌సూళ్ల‌ను తెస్తోంద‌ని భ‌రోసానిచ్చింది.

తాజా స‌మాచారం మేర‌కు.. సూర్య‌వంశీ చిత్రం ఆదివారం నాడు ఈ చిత్రం 28.5 కోట్లు నుండి రూ. 31 కోట్లు సుమారుగా వ‌సూలు చేసింద‌ని ఇప్ప‌టికే సుమారు 80కోట్లు వ‌సూలు చేసింది. తాజా రిజ‌ల్టుని బ‌ట్టి రోహిత్ శెట్టి త‌న బ్రాండ్ ని నిల‌బెట్టుకున్నాడు. ఈ ప్రత్యేక సెగ్మెంట్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్దగా అంగీకరించార‌నే అర్థం. ప్రారంభ వారాంతపు గణాంకాలు ఫ్రాంచైజీ విలువ .. అజయ్ దేవ్‌గన్ - రణవీర్ సింగ్ ల వ‌ల్ల ఎలివేట్ అయ్యింది. ప్రేక్షకులను ఇప్పుడు కూడా తిరిగి తీసుకురావడానికి ప్రతిదీ కలిసి వచ్చింది.

రాత్రి 7 గంటల వరకు వెలువ‌డిన సూర్య‌వంశీ బాక్సాఫీస్ గణాంకాలు శుక్రవారం కంటే దాదాపు 10శాతం ఎక్కువగా ఉన్నందున జాతీయ చైన్ లలో కూడా బిజ్ పైకి వెళ్లింది. సినిమా ప్రారంభ వారాంతంలో అన్ని అంచనాలను మించిపోయింది. ఇప్పుడు లాంగ్ రన్ లో కూడా పెద్ద మొత్తంలో రాబ‌ట్టాలని చూస్తోంది. సినిమా హాళ్లలో పెద్ద టికెట్ ఎంటర్ టైనర్ ను ఎంజాయ్ చేయ‌డానికి ప్రేక్షకులు ఎట్టకేలకు పెద్ద సంఖ్యలో తిరిగి రావడంతో వీకెండ్ బాక్సాఫీస్ సంఖ్య సినిమా పరిశ్రమకు ఆశను రేకెత్తించింది.

ఈ చిత్రం గుజరాత్ -మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ/యుపి- పంజాబ్ ల‌లో చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను తెచ్చింది. రోహిత్ శెట్టికి ఈ ఏరియాలు ఎప్పుడూ బలమైనవి. తరువాత అక్షయ్ కుమార్ కోర్ బెల్ట్ ఏరియాలు ఉన్నాయి. బీహార్- రాజస్థాన్ లు కూడా సూర్యవంశీ వ‌సూళ్ల‌కు సహకారాన్ని అందించాయి. ఔట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా కాబట్టి ప్రేక్షకులను ఈ సర్క్యూట్ లలోకి తీసుకురాగ‌లిగారు. ఇప్పుడు అందరి దృష్టి కీలకమైన సోమవారంపైనే ఉంది. మొదటి 7రోజుల్లో ఈ చిత్రం 125 కోట్ల మార్కును వసూలు చేసేందుకు ఆస్కారం ఉంద‌ని అంచ‌నాలు వెలువుతున్నాయి.