Begin typing your search above and press return to search.
ఐష్ తో పోటీపడితే పరువుపోతుందని భయపడిన సుష్
By: Tupaki Desk | 6 Jun 2021 4:30 PM GMTఇప్పటివరకూ భారత దేశం నుంచి ఎందరో భామలు అందాల పోటీల్లో జగజ్జేతలుగా నిలిచి అరుదైన కిరీటాలు గెలుచుకున్నారు. మిస్ ఇండియా.. మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందగత్తెల్ని తలదన్ని సత్తా చాటారు. ప్రపంచ సుందరీమణులుగా ఆవిర్భవించారు. అయితే దేశం నుంచి ఎందరు అందగత్తెలు పుట్టుకొచ్చినా ఐశ్వర్యారాయ్ వన్నె తరగని అందం ముందు తీసికట్టుగానే కనిపిస్తారు.
ఇందుకు ఐష్ సమకాలీన అందగత్తె సుష్మితా సేన్ సైతం అతీతం కాదు.
ఐశ్వర్య రాయ్ బచ్చన్ కారణంగా సుష్మితా సేన్ తన పేరును అందాల పోటీ నుండి తీసివేయాలని కోరుకున్నారట.
ఒక ప్రముఖ చాట్ షోలో మిస్ ఇండియా అందాల పోటీని గెలుచుకున్నప్పటి తన అనుభవం గురించి సుష్మిత ఓపెనయ్యారు. ప్రపంచవ్యాప్తంగా బోలెడంత చర్చల మధ్య పోటీలో విజేతగా ప్రకటించినప్పుడు తాను ఎలా స్పందించిందో సుష్ వివరించింది. విజేతగా తన పేరు విన్న తర్వాత తాను షాక్ కు గురయ్యానని ప్రారంభంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా తన సరసన పోటీ పడుతున్నట్లు తెలియగానే ఆమె తన పేరును పోటీ నుండి తొలగించాలని భావించానని చెప్పారు. ``ఇది మిస్ ఇండియా కోసం వెళ్లినప్పటి విషయం. ఐష్ తో పోటీపడి ఇంటికి తిరిగి రావడానికి ప్రయత్నించనని అమ్మకు చెప్పాను`` అని సుష్ వివరించింది.
``అత్యంత అందమైన మహిళ`` పోటీలకు వెళ్లి ఓడిపోయేలా తన తల్లి తనను ప్రోత్సహించిందని సుష్మిత వెల్లడించింది. అందాల పోటీని గెలవలేనని భావించిందట. ఈ కార్యక్రమానికి హాజరుకావద్దని తల్లిని కూడా కోరింది. అదే సంవత్సరంలో ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ (ప్రపంచ సుందరి) గా అవతరించింది. మిస్ యూనివర్స్ (విశ్వసుందరి) టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా సుష్మిత సేన్ నిలిచింది. సంవత్సరాలుగా ఇద్దరు నటీమణులు మోడలింగ్ ప్రపంచంలో బాలీవుడ్ లో తమ సాధికారిక ప్రయాణంతో ప్రతి ఒక్కరినీ మంత్రముగ్దులను చేశారు.
సుష్మితా సేన్ తన అద్భుతమైన విజువల్ ప్రెజెన్స్ తో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ లో విజయవంతంగా ప్రవేశించే ముందు క్రేజీగా మోడలింగ్ ప్రయాణంతో ప్రజలను ఆశ్చర్యపరిచింది. 18 సంవత్సరాల వయసులో మిస్ ఇండియా కిరీటం అదే సంవత్సరం మిస్ యూనివర్స్ (1994) బిరుదును గెలుచుకున్నప్పుడు సుష్మితా సేన్ పేరు సంచలనంగా మారింది. అయితే బాలీవుడ్ కెరీర్ లో ఐశ్వర్యారాయ్ స్థాయిని మాత్రం సుష్మితా సేన్ అందుకోలేకపోయిన సంగతి తెలిసినదే. ఐష్ దశాబ్ధాల పాటు పరిశ్రమను ఏలారు.