Begin typing your search above and press return to search.
#సుశాంత్.. హత్యా? ఆత్మహత్యా? ఫోరెన్సిక్ తేల్చాలి!- ఎయిమ్స్
By: Tupaki Desk | 25 Sep 2020 5:45 PM GMTసుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణమేమిటో ఇన్నాళ్లు దర్యాప్తులో ఏదీ తేలకపోవడం రీపోస్ట్ మార్టమ్ వ్యవహారాలతో ప్రతిదీ నివేదిక లు రాకపోవడం వగైరా వ్యవహారాలు నెటిజనుల్లో చర్చకు వస్తున్నాయి. అయితే వాస్తవం వేరు అంటూ సుశాంత్ కుటుంబానికి చెందిన న్యాయవాది వికాస్ సింగ్ గత వాదనలను తోసిపుచ్చారు. సుశాంత్ గొంతు కోసి చంపినట్లు ఎయిమ్స్ టీమ్ కి చెందిన సభ్యుడు ఒకరు చెప్పినట్లు న్యాయవాది పేర్కొన్నారు.
ప్రఖ్యాత జాతీయ మీడియా కథనం ప్రకారం, ``మార్కులు(గాట్లు పడి ఉండడం) చూడటం ద్వారా అభిప్రాయం చెప్పలేము" అని ఎయిమ్స్ ప్యానెల్ చీఫ్ సుధీర్ గుప్తా అన్నారు. ఇప్పటివరకు ఎటువంటి తీర్మానాలు చేయలేదు. అంతేకాదు ఎయిమ్స్ టీమ్ సహనం కోరింది``. ముంబై పోలీసులు ప్రారంభ దర్యాప్తులో నటుడు ఆత్మహత్యతో మరణించాడని తేల్చిన తరువాత సుశాంత్ మరణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్న సంగతి విధితమే.
డాక్టర్ గుప్తా మాట్లాడుతూ, “లిగెచర్ గుర్తులు ఉన్న దృశ్యాన్ని చూస్తుంటే నరహత్య లేదా ఆత్మహత్య గురించి ఎటువంటి తీర్మానం లేదా ముగింపు అభిప్రాయం ఇవ్వలేం. ఇది వైద్యులకు కష్టం. సాధారణ వ్యక్తులకు అసాధ్యం. కేవలం అంతర్గత లింక్ విచక్షణ ఫోరెన్సిక్ వివరణ అవసరం” అని అన్నారు. రియా వల్లనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. నిధులను దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తూ సుశాంత్ తండ్రి నటుడి స్నేహితురాలు రియా చక్రవర్తిపై ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేశారు. రియాపై అభియోగాలు ఆలస్యం కావడం పట్ల న్యాయవాది వికాస్ సింగ్ అప్పట్లో నిరాశను వ్యక్తం చేశారు.
అతను ఒక ట్వీట్‌లో ప్రస్థావిస్తూ, “సిబిఐ ఆలస్యంతో ఆత్మహత్యగా మార్చడానికి ప్రయత్నించారు. ఎయిమ్స్ బృందంలో భాగమైన డాక్టర్ చాలా కాలం క్రితం నాకు పంపిన ఫోటోలు 200 శాతం మర్డర్ అని సూచించాయి. గొంతు పిసికి చంపారు. ఆత్మహత్య కాదు” అని రాశారు. ఈ ట్వీట్ ను సుశాంత్ సింగ్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి కూడా పంచుకున్నారు. ``మేం ఇంతకాలం ఓపికగా ఉన్నాము! నిజం తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ” అని ప్రశ్నించారు శ్వేతా.
రియా ప్రస్తుతం బైకుల్లా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉంది. సుశాంత్ కోసం డ్రగ్స్ సేకరించినందుకు ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులో డ్రగ్స్ కోణాన్ని ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. రియా ఆమె సోదరుడు షోయిక్ మాదకద్రవ్యాల కొనుగోలుకు సుశాంత్ డబ్బు వినియోగించినట్టు ఆధారాలు కనుగొన్నారు. వారి ఆర్థిక కార్యకలాపాలను పరిశీలిస్తున్నప్పుడు ఇది బయటపడింది. రియా, షోయిక్ చేసిన బెయిల్ అభ్యర్థనలపై బాంబే హైకోర్టు సెప్టెంబర్ 29 న విచారణ జరుపుతుందని జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి.