Begin typing your search above and press return to search.

బాయ్ కాట్ బింగో.. ర‌ణ‌వీర్ పై సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ గుర్రు!

By:  Tupaki Desk   |   20 Nov 2020 2:30 PM GMT
బాయ్ కాట్ బింగో.. ర‌ణ‌వీర్ పై సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ గుర్రు!
X
రణ్‌వీర్ సింగ్ నటించిన ఒక ప్రకటన తాజాగా బాలీవుడ్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపింది. ఈ ప్ర‌క‌ట‌న లో ర‌ణ‌వీర్ రైవ‌ల్రీ స్టార్ గా ముద్ర ప‌డిన సుశాంత్ సింగ్ కి అవ‌మానం జ‌రిగిందని ఆరోపిస్తూ అభిమానులు ఆ ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌సారం చేసిన `బింగో`ని బాయ్ కాట్ చేయ‌డం సంచ‌ల‌న‌మైంది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు # బాయ్ కాట్ బింగోను గురువారం ట్రెండ్ చేశారు. స‌ద‌రు ఆహార ఉత్పత్తి బ్రాండ్ `తప్పు` చేసింద‌ని సుశాంత్ సింగ్ అభిమానులు ఆరోపించారు.

ఇంత‌కీ బింగో ఏం త‌ప్పు చేసింది? అంటే.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి సైన్స్ పై ఉన్న ప్రేమ‌ను అభిమానాన్ని అప‌హాస్యం చేస్తూ ర‌ణ‌వీర్ తో యాడ్ ని రూపొందించింది. దీంతో ఈ వివాదం రాజుకుంది.

అయితే దివంగ‌త హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో మా ప్ర‌క‌ట‌న‌కు ఎలాంటి సంబంధం లేదు! అంటూ బింగో బ‌హిరంగ ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. రణవీర్ సింగ్ నటించిన బింగో అధికారిక ప్రకటనలో ఎవ‌రినీ కించ‌ప‌ర‌చ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది.

సైన్స్ పట్ల సుశాంత్ కి ఉన్న ప్రేమను ఎగతాళి చేయడం ద్వారా తమ అభిమాన నటుడిని ఎగతాళి చేసిందని కంపెనీ పై సుశాంత్ అభిమానులు తీవ్రంగా విరుచుకుప‌డుతున్నారు. అయితే ఈ ప్ర‌క‌ట‌న‌ను విమర్శించేవారు తమ బ్రాండ్ కోసం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి బలమైన ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంటూ బింగో అధికారిక ప్రకటన విడుదల చేసింది. రణ‌వీర్ ‌తో 2019 అక్టోబర్ లో ఈ ప్రకటనను చిత్రీకరించామ‌ని స‌ద‌రు ఆహార సంస్థ తెలిపింది. అయితే ఆల‌స్యంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం వ‌ల్ల త‌ప్పుగా క‌న్వే అయ్యింద‌ని వివ‌రణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది స‌ద‌రు సంస్థ‌.

ఇక ర‌ణ‌వీర్ వ‌ర్సెస్ సుశాంత్ వివాదం విష‌యానికి వ‌స్తే... బాలీవుడ్ లో ఇన్ సైడ‌ర్ గా ర‌ణ‌వీర్ కి గుర్తింపు ద‌క్కితే.. ఔట్ సైడ‌ర్ గా సుశాంత్ కి గుర్తింపు ఉంది. క‌ర‌ణ్ జోహార్ కి స‌న్నిహితుడిగా ఉండే ర‌ణ‌వీర్ స్వ‌యంకృషితో ఎదిగినా సుశాంత్ అభిమానులు అత‌డిని బాలీవుడ్ మాఫియా క‌నుస‌న్న‌ల్లో న‌డిచే ఇన్ సైడ‌ర్ అనే భావిస్తున్నారు. ర‌ణ‌వీర్ కి అవ‌కాశాలిచ్చేందుకు సుశాంత్ కి ఛాన్సుల్లేకుండా చేశార‌న్న తీవ్ర ఆరోప‌ణ‌లు వారు ఇప్ప‌టికే చేశారు.