Begin typing your search above and press return to search.
రియా చక్రవర్తి పై పోలీసులకు కంప్లైంట్ చేసిన సుశాంత్ తండ్రి...!
By: Tupaki Desk | 28 July 2020 5:50 PM GMTబాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ లో నెలకొన్న బంధుప్రీతి మరియు ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు కారణమనే విమర్శలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సుశాంత్ సూసైడ్ కేసుపై పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ముంబై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులను.. సుశాంత్ సన్నిహితులను విచారించారు. ఇప్పుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్ మృతిపై ఆయన తండ్రి కేకే సింగ్ పాట్నాలోని రాజేంద్రనగర్ పోలీసుల స్టేషన్ లో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేశారు.
రియా చక్రవర్తితో పాటు మరికొందరిరు మోసం, కుట్రకు పాల్పడటం ద్వారా సుశాంత్ ఆత్మహత్యకు కారణమయ్యారని కంప్లైంట్ లో పేర్కొన్నారు. కేకే సింగ్ ఫిర్యాదు మేరకు రియాతో పాటు మరో ఐదుగురి మీద సెక్షన్ 341, 323, 342, 420 మరియు 406 కింద కేసు నమోదు చేశారు పాట్నా పోలీసులు. అంతేకాకుండా ఈ కేసుపై విచారణ జరిపేందుకు ప్రత్యేక పోలీసుల బృందాన్ని ముంబైకి పంపించారు. ముంబైలోనే కంప్లైంట్ చేయాలని ఆయన భావించినప్పటికీ ఆరోగ్యరీత్యా ప్రయాణం చేయడం కుదరక పాట్నాలోనే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సుశాంత్ మరణం తర్వాత ఇన్ని రోజులుగా సైలెంటుగా ఉన్న సుశాంత్ కుటుంబం ఇప్పుడు రియాపై కంప్లైంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా రియా చక్రవర్తి కూడా నెల రోజుల తర్వాత సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆమె సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు సుశాంత్ సింగ్ తండ్రి ఏకంగా రియా చక్రవర్తిని బాధ్యురాలిని చేస్తూ కంప్లైంట్ చేయడంతో ఈ కేసులో మరిన్ని కోణాలు బయటపడనున్నాయని అందరూ భావిస్తున్నారు.