Begin typing your search above and press return to search.

స్టింగ్ ఆపరేషన్‌ లో సంచలన విషయాలు బయటపెట్టిన సుశాంత్ ఫిజికల్ ట్రైనర్...!

By:  Tupaki Desk   |   31 July 2020 2:30 AM GMT
స్టింగ్ ఆపరేషన్‌ లో సంచలన విషయాలు బయటపెట్టిన సుశాంత్ ఫిజికల్ ట్రైనర్...!
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ సూసైడ్ కేసులో రోజుకొక కొత్త విషయం బయటపడుతోంది. ఇప్పటికే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అతడి మరణానికి కారణమనే విధంగా కేసు మలుపు తిరుగుతున్న తరుణంలో.. రియా చక్రవర్తి గురించి సుశాంత్ ఫిట్‌ నెస్ ట్రైనర్ సమీ అహ్మద్ సంచలన విషయాలను బయటపెట్టారు. ప్రముఖ నేషనల్ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌ లో రియా సుశాంత్ కి ఇప్పించిన ట్రీట్మెంట్ గురించి వెల్లడించారు సమీ.

సమీ అహ్మద్ మాట్లాడుతూ.. ''సుశాంత్ తో గత 5 ఏళ్లుగా కలిసి పని చేస్తున్నాను. ఆయన చాలా కష్టపడారు. శరీరం గురించే కాకుండా మానసిక ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ చూపిస్తాడు. సాధారణంగా సినీ తారలు ఐస్ క్రీమ్స్ జంక్ ఫుడ్‌ లాంటివి తినరు. కానీ సుశాంత్ వాటిని తిని కూడా బాడీని ఫిట్‌ గా ఉంచుకుంటారు'' అని తెలిపారు. ఇంకా అతను మాట్లాడుతూ.. ''సుశాంత్ సింగ్ చాలా మంచి మనిషి. ఆయన అందరిలాంటి వారు కాదు. నాతో పాటు మా అమ్మకి కూడా చాలా క్లోజ్. ఆయన చనిపోవడానికి రెండు వారాల ముందు నాతో మాట్లాడారు. నా తల్లి మే 29న మరణిస్తే ఆ విషయం తెలుసుకొని జూన్ 1న నాకు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడారు. ఎలాంటి అవసరం ఉన్నా నాకు చెప్పమని ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్లి కలిశాను. తండ్రిని బాగా చూసుకోమని.. తల్లి మరణం వల్ల ఎలాంటి విషాదం ఉంటుందో నాకు తెలుసని చెప్పారు. నాతో మాట్లాడిన రెండు వారాల్లోనే ఆయన చనిపోయాడనే వార్త వినడం నాకు చాలా బాధ కలిగింది. దాని నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది'' అని చెప్పుకొచ్చారు.

''రియా చక్రవర్తితో వచ్చిన తర్వాత సుశాంత్ పరిస్థితి అంతా మారిపోయింది. అప్పటి నుంచి ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. సుశాంత్‌ కు రియా డాక్టర్స్ సలహాలు పాటించకుండా డ్రగ్స్ ఇచ్చి ఉండొచ్చు. ఆయనకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్‌ కు అంతకు ముందు సుశాంత్ కి ఏమి జరిగిందనే విషయం తెలియదు. సుశాంత్ మానసిక పరిస్థితి తెలియకుండానే రియా తీసుకొచ్చిన డాక్టర్ ఆయనకి చికిత్స చేశారు. సుశాంత్ ఆరోగ్య సమస్యలు తెలియకుండా.. ఇంతకముందు డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ గురించి తెలుసుకోకుండానే ఆయన సుశాంత్‌ కు మెడిసిన్స్ ఇచ్చారు'' అని సమీ అహ్మద్ స్టింగ్ ఆపరేషన్‌ లో వెల్లడించారు.