Begin typing your search above and press return to search.

రిలీజ్ కు ముందే లాభాల్లో సుశాంత్ 'IVNR' సినిమా..

By:  Tupaki Desk   |   25 Aug 2021 9:30 AM GMT
రిలీజ్ కు ముందే లాభాల్లో సుశాంత్ IVNR సినిమా..
X
యంగ్ హీరో సుశాంత్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''ఇచ్చట వాహనములు నిలుపరాదు''. 'నో పార్కింగ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదలకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, చిత్ర బృందం అగ్రెసివ్ గా ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తోంది. దీనికి తగ్గట్టుగానే IVNR మూవీ అసాధారణమైన నాన్-థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమా ఓటీటీ రైట్స్ ను సుమారు రూ. 3 కోట్లు చెల్లించి తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహా తీసుకుందని మేకర్స్ వెల్లడించారు. అలానే హిందీ హక్కులను రూ. 2.75 కోట్లకి సోనీ కి ఇవ్వగా.. మ్యూజిక్ రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ కంపెనీ రూ. 15 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక తెలుగు శాటిలైట్ హక్కుల ద్వారా మేకర్స్ కు రూ. 2 కోట్లు వచ్చాయి. మొత్తం మీద నాన్-థియేట్రికల్ డీల్స్ ద్వారా 1.5 కోట్ల లాభాలను నిర్మాతలు జేబులో వేసుకున్నారు. సుశాంత్ సినిమా రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్ లో ఉండటం గొప్ప విషయమనే చెప్పాలి.

'IVNR' చిత్రాన్ని అన్నపూర్ణ మరియు ఏషియన్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌ వర్క్స్ ద్వారా మేకర్స్ సొంతంగా విడుదల చేస్తున్నారు. థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం మరియు ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించడమే కాకుండా.. సినిమాపై బజ్ క్రియేట్ చేసాయి. ఈ క్రమంలో భవిష్యత్తులో ఈ సినిమాని తమిళం మరియు హిందీ వంటి ఇతర భాషలలో చేయడానికి చర్చలు కూడా జరుగుతున్నాయి.

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ తో ఎస్. దర్శన్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఏ1 స్టూడియోస్ మరియు శాస్త్ర మూవీస్ బ్యానర్లపై ఈఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ నటి భానుమతి మనవడు రవిశంకర్ శాస్త్రి మరియు ఏక్తా శాస్త్రి - హరీష్ కొయ్యలగుండ్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'IVNR' చిత్రంలో సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.

ఇందులో వెంకట్ - వెన్నెల కిషోర్ - ప్రియదర్శి - అభినవ్ గోమటం - ఐశ్వర్య - నిఖిల్ కైలాస - కృష్ణ చైతన్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ ఎడిటింగ్ వర్క్ చేశారు. 'చి.ల.సౌ' వంటి సూపర్ హిట్ తర్వాత సుశాంత్ సోలో హీరోగా నటిస్తున్న 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.