Begin typing your search above and press return to search.
మనంలో రాలేదని ఫీల్ అవుతున్నాడు
By: Tupaki Desk | 16 Aug 2016 5:30 PM GMTఅక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుశాంత్.. బాగా బ్యాలెన్సెడ్ గా సినిమాలు చేస్తుంటాడు. క్వాంటిటీ విషయంలో అసలు ఈ కుర్రాడికి లెక్కే లేదు. ఎనిమిదేళ్ల క్రితం అరంగేట్రం చేసిన సుశాంత్.. ఇప్పటికి మూడే మూడు సినిమాల్లో హీరోగా కనిపించాడు. గతేడాది దొంగాటలోనూ యాక్ట్ చేసినా.. ఇది చిన్న పాత్ర మాత్రమే.
ఆటాడుకుందాం రా.. అంటూ ఈ శుక్రవారం మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు సుశాంత్. తన ప్రతీ సినిమా మాదిరిగానే.. ఈ మూవీలోనూ కామెడీకే ఇంపార్టెన్స్ ఇచ్చానని చెప్పిన సుశాంత్.. శ్రీర్ సీపాన కథ చెప్పిన తర్వాత కళ్లలో నీళ్లొచ్చేంతలా నవ్వాడట. సింగిల్ సిట్టింగ్ లోనే స్టోరీ ఓకే చేసేశానని.. ఎంటర్టెయిన్మెంట్ తో పాటు గుండెను తాకే సన్నివేశాలు కూడా సినిమాలో ఉంటాయని చెబుతున్నాడు సుశాంత్. అయితే.. అక్కినేని హీరోలంతా కలిసి నటించిన మనంలో ఛాన్స్ రాకపోయినా.. ఆటాడుకుందాం రా.. మూవీలో నాగచైతన్య.. అఖిల్ లతో కలిసి నటించినందుకు సంతోషంగా ఉందని చెప్పాడీ కరెంట్ హీరో.
చైతు రోల్ ని ముందే అనుకున్నారట కానీ.. సినిమా బాగా వస్తేనే అడుగుదామని భావించారట. రషెస్ చూసుకుని.. ఔట్ పుట్ పై నమ్మకం కలిగాకే చైతును అప్రోచ్ అయ్యామన్న సుశాంత్.. అఖిల్ ని ఈ మూవీలో చేయాల్సిందిగా తన అమ్మ అడిగిందన్నాడు. పల్లెకు పోదాం పారును చూద్దాం సాంగ్ మొత్తాన్ని రీమిక్స్ చేయలేదని.. కేవలం ఒక బీట్ మాత్రమే ఉపయోగించుకున్నామని.. ఈ పాటలో తన పంచెకట్టుకు మంచి రెస్పాన్స్ వచ్చిందని తెగ సంతోషంగా చెబుతున్నాడు సుశాంత్.