Begin typing your search above and press return to search.
నాగ్ మేనల్లుడు ఏం చెప్పదలుచుకున్నాడు?
By: Tupaki Desk | 1 Aug 2018 12:30 PM GMTదశాబ్ద కాలం పాటు పోరాడినా ఒక్కటంటే ఒక్క హిట్టు కొట్టలేకపోయాడు అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్. సొంత బేనర్లో నాలుగు సినిమాలు చేస్తే నాలుగూ ఫ్లాపులే. చాలా వరకు కమర్షియల్ స్టయిల్లో సినిమాలు చేసి ఎదురు దెబ్బలు తిన్నాడు సుశాంత్. కానీ ఈసారి పూర్తిగా రూటు మార్చి ఒక సింపుల్ లవ్ స్టోరీలో నటించాడు. అదే.. చి ల సౌ. ఈ సినిమా గురించి సుశాంత్ చాలా ప్రత్యేకంగా చెబుతున్నాడు. ఇన్నాళ్ల తన ఫెయిల్యూర్లలో తన ప్రమేయం పెద్దగా లేదని.. కానీ ‘చి ల సౌ’ విజయం సాధిస్తే మాత్రం అందులో క్రెడిట్ తనకివ్వాలని అతను చెబుతున్నట్లుగా ఉంది. తన గత సినిమాల విషయంలో చాలా మంది అభిప్రాయాలు కలిశాయని.. తన సొంత నిర్ణయంతో సినిమాలు చేయలేదని సుశాంత్ చెబుతున్నాడు.
తొలిసారిగా కెరీర్లో పూర్తిగా తన సొంత ఆలోచనలతో చేసిన సినిమా ‘చి ల సౌ’ అనే అంటున్నాడు. ఇది తన మనసుకు నచ్చిన సినిమా అని.. తాను ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నానో రాహల్ రవీంద్రన్ కు చెప్పి మరీ అతను ఈ కథను తన దగ్గరికి తెచ్చేలా చేశానని అంటున్నాడు. ఇందులో ఇంకెవ్వరి ప్రమేయం కూడా లేదని అంటున్నాడు. అంటే.. సుశాంత్ ఇంతకుముందు చేసిన సినిమాల్లో అక్కినేని కుటుంబ సభ్యుల జోక్యం చాలా ఉందనుకోవాలి. సుశాంత్ ను మాస్ హీరోగా నిలబెట్టేద్దామని.. అందరూ కలిసి మసాలాలు అద్దేశారనుకోవాలి. ఈసారి మాత్రం ఎవరి జోక్యం లేకుండా తాను తన టేస్టుకు తగ్గ సినిమా చేశానని.. తన ఒరిజినల్ టేస్టు ఇదే అని సుశాంత్ చెప్పదలుచుకున్నాడేమో. మొత్తానికి సుశాంత్ సొంత జడ్జిమెంట్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో ఈ శుక్రవారం తేలిపోతుంది.