Begin typing your search above and press return to search.
బహ్మి చెలరేగిపోతాడంటున్న ఆ హీరో
By: Tupaki Desk | 17 Aug 2016 7:30 AM GMTరెండు మూడేళ్ల ముందు వరకు టాలీవుడ్ లో బ్రహ్మానందమే నెంబర్ వన్ కమెడియన్. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆయన ఆదిపత్యం సాగింది టాలీవుడ్లో. కానీ ఈ మధ్య అనుకోకుండా ఆయన జోరు తగ్గిపోయింది. సరైన క్యారెక్టర్లు పడక.. కామెడీ రొటీన్ అయిపోవడం వల్ల బ్రహ్మి నెమ్మదిగా కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. బ్రహ్మి ఈ మధ్యే ‘బాబు బంగారం’లో కనిపించాడు కానీ.. అందులోనూ నవ్వించలేకపోయాడు. ఐతే బ్రహ్మి నవ్వించలేకపోతే అది రచయితలు.. దర్శకుల తప్పే కానీ.. ఆయన తప్పు కాదు. సరైన క్యారెక్టర్ పడాలే కానీ బ్రహ్మి ఇప్పటికైనా చెలరేగిపోగలడు. తన కొత్త సినిమా ‘ఆటాడుకుందాం రా’లో బ్రహ్మికి అలాంటి పాత్రే దక్కిందంటున్నాడు సుశాంత్.
‘ఆటాడుకుందాం రా’ సినిమాలో టైం మెషీన్ కామెడీ హైలైట్ గా నిలుస్తుందని.. ఆ ఎపిసోడ్ లో బ్రహ్మి చెలరేగిపోయాడని చెబుతున్నాడు సుశాంత్. ‘‘రచయిత శ్రీధర్ సీపాన ఈ ఎపిసోడ్ గురించి తొలిసారి చెప్పినపుడే నాకు నవ్వాగలేదు. అంత హిలేరియస్ గా ఉంటుంది. దర్శకుడు నాగేశ్వరరెడ్డి ఈ సన్నివేశాల్ని చాలా బాగా తెరకెక్కించాడు. నాకు, బ్రహ్మానందం గారికి మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. బ్రహ్మానందం గారి కెరీర్లో ఇదొక చెప్పుకోదగ్గ పాత్ర’’ అని సుశాంత్ చెప్పాడు. సుశాంత్ సరసన సోనమ్ బజ్వా కథానాయికగా నటిస్తున్న ‘ఆటాడుకుందాం రా’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రధానంగా కామెడీనే నమ్ముకుని వస్తున్న సుశాంత్.. ఈసారైనా సక్సెస్ చూస్తాడేమో చూద్దాం.