Begin typing your search above and press return to search.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతున్న సుశాంత్ సింగ్ లాస్ట్ మూవీ...!
By: Tupaki Desk | 25 Jun 2020 12:10 PM GMTబాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇటీవల సూసైడ్ చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ అభిమానులందరూ సుశాంత్ చివరగా నటించిన సినిమా 'దిల్ బేచారా' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ఓటీటీలో రిలీజ్ కాబోతోందని.. ఇప్పటికే ఓ ప్రముఖ ఓటీటీతో చర్చలు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిని నిజం చేస్తూ ఇప్పుడు తాజాగా సుశాంత్ సింగ్ లాస్ట్ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'దిల్ బేచరా' సినిమా రిలీజ్ కాబోతోంది. జూలై 24న స్ట్రీమింగ్ కానున్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రైబర్స్ మరియు నాన్ సబ్స్క్రైబర్స్ అందరికి అందుబాటులో ఉంచబోతున్నట్లు ప్రకటించారు. దీంతో అందరూ ఈ సినిమా చూసే అవకాశం ఉంది.
నిజానికి 'దిల్ బేచారా' సమ్మర్ కానుకగా మే 8న రిలీజ్ కావాల్సింది. అయితే కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల వలన వాయిదా పడింది. ముఖేష్ ఛబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారు నిర్మించారు. ఈ సినిమా 'ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' అనే నవల ఆధారంగా రూపొందింది. సుశాంత్ తో పాటు సంజన సాంఘి, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ - సంజన సాంఘి ఇద్దరూ క్యాన్సర్ పేషెంట్స్ గా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా ఓటీటీలో రిలీజ్ చేయొద్దు.. థియేటర్స్ లో విడుదల చేయండి అంటూ #DilBecharaOnBigScreen హ్యాష్ ట్యాగ్ తో ఇంతకముందే సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రెండ్ చేశారు. కానీ ఓటీటీలోనే రిలీజ్ కాబోతోందని ఆఫీసియల్ గా ప్రకటించారు. ఇప్పుడు కూడా నెటిజన్స్ సుశాంత్ లాస్ట్ మూవీ థియేటర్స్ రిలీజ్ చేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా సుశాంత్ గత చిత్రం 'డ్రైవ్' కూడా ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.