Begin typing your search above and press return to search.

9 బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను కోల్పోయిన సుశాంత్ సింగ్

By:  Tupaki Desk   |   14 Jun 2021 3:30 PM GMT
9 బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను కోల్పోయిన సుశాంత్ సింగ్
X
యువ‌హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక బ‌ల‌వ‌న్మ‌ర‌ణం బాలీవుడ్ లో ఎలాంటి ప్ర‌కంప‌నాల‌కు తెర తీసిందో తెలిసిందే. ఈ మిస్ట‌రీ కేసులో ర‌క‌ర‌కాల కోణాల‌పై ద‌ర్యాప్తు నిరంత‌రాయంగా సాగింది. ఇప్ప‌టికీ అత‌డి మ‌ర‌ణానికి కార‌ణాలేమిటో సీబీఐ ద‌ర్యాప్తులో తేల‌లేదు. డ్ర‌గ్స్ కుంభ‌కోణం ఆర్థిక వ్య‌వ‌హారాలు.. ప్రియురాలి కుట్ర‌.. బాలీవుడ్ మాఫియా ఇలా అన్నిర‌కాలుగా విచార‌ణ సాగింది. కానీ నిజాలేమిటో తేల‌నేలేదు.

చిచ్చోర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించి టాప్ పొజిష‌న్ కి వెళ్లే అవ‌కాశం ఉండీ సుశాంత్ సింగ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌డం అంతుచిక్క‌ని మిస్ట‌రీగానే మారింది. ఇక సుశాంత్ సింగ్ త‌న కెరీర్ లో 9 బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ ని కోల్పోయాడ‌న్న‌ది తెలిసింది త‌క్కువ మందికే.

బాలీవుడ్ మాఫియా బెదిరింపుల వ‌ల్ల అత‌డు కొన్ని సెన్సేష‌న‌ల్ హిట్స్ లో న‌టించే అవ‌కాశాల్ని కోల్పోయాడు. క‌ర‌ణ్ జోహార్ .. భ‌న్సాలీ లాంటి అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అత‌డికి అవ‌కాశాలు ఇచ్చిన‌ట్టే ఇచ్చి దూరం చేయ‌డం అత‌డిని మాన‌సికంగా కుంగ‌దీసిందని క‌థ‌నాలొచ్చాయి.

భ‌న్సాలీ తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు.. రామ్ లీలా.. భాజీరావు మ‌స్తానీ.. ప‌ద్మావ‌త్ 3డి వీట‌న్నిటికీ సుశాంత్ మొద‌టి ఆప్ష‌న్ .. కానీ చివ‌రికి ఏమైందో అతడు త‌ప్పుకున్నాడు. రామ్ లీలా.. భాజీరావు మ‌స్తానీ చిత్రాల్లో ర‌ణ‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు.

కెరీర్ లో కై పో చే - ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ- కేదార్ నాథ్- చిచోర్, దిల్ బెచారా వంటి చిత్రాలలో అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న సుశాంత్ సింగ్.. తన నటనా పరాక్రమం కారణంగా ప్రేక్షకుల హృదయాల్లోకి దూసుకెళ్ళాడు. అతను పరిశ్రమలో చాలా మంది దర్శకులు నిర్మాతలకు ఇష్టమైన వ్యక్తిగా అవతరించాడు. అయితే బాలీవుడ్ మాఫియా అత‌డిని ఒంట‌రిని చేసింది. కెరీర్ ఆరంభ‌మే అనేక అవకాశాలను కోల్పోయాడు.

అంధాధున్ చిత్రంలో సుశాంత్ న‌టించాల‌ని దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ కోరుకున్నారు. కానీ ప్రణాళిక ప్రకారం పనులు జరగలేదు ఆ తరువాత ఆయుష్మాన్ ఖుర్రానా ఈ పాత్రలో న‌టించాడు. అలాగే షాహిద్ క‌పూర్ న‌టించిన కబీర్ సింగ్ లో తొలి ఆప్ష‌న్ సుశాంత్ సింగ్. కబీర్ సింగ్ నిర్మాతలు మొదట ఈ పాత్రను సుశాంత్ .. అర్జున్ కపూర్ లకు ఆఫ‌ర్ చేసారు. ఇద్దరు నటులు ఈ చిత్రాన్ని తిరస్కరించాకే వారు షాహిద్ కపూర్ ని సంప్ర‌దించార‌ట‌. జాన్ అబ్రహం నటించిన రోమియో అక్బర్ వాల్టర్ కి తొలి ఆప్ష‌న్ సుశాంత్. కాని అతను వైదొలిగాడు. చేతన్ భగత్ నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి మేకర్స్ మొదట సుశాంత్ సింగ్ రాజ్ పుత్ - కృతి సనోన్ లను జంట‌గా పరిగణించారు. కానీ సుశాంత్ చేజారింది. బేఫిక‌ర్ లో తొలి ఆప్ష‌న్ సుశాంత్ సింగ్. శుధ్ దేశీ రొమాన్స్ లో హిట్ పెయిర్ గా పాపుల‌ర‌య్యాక వాణి కపూర్ -సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లకు చోప్రాలు ఛాన్సిచ్చారు. కొన్ని కారణాల వల్ల రణవీర్ సింగ్ పాత్రను ఆఫర్ చేశారు.

బాక్సాఫీస్ వద్ద రూ .350 కోట్లు వసూలు చేసిన బాజీరావ్ మస్తానీని మొదట సుశాంత్ సింగ్ కే ఆఫ‌ర్ ద‌క్కింది. కానీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి అవసరమైన కాల్షీట్లు లేనందున అతను సినిమా చేయలేద‌ని ప్ర‌చార‌మైంది.

సంజయ్ లీలా భన్సాలీ చిత్రం - పద్మావత్ సుశాంత్ చేయాల్సిన‌దే.. అతను 2015 వరకు యష్ రాజ్ ఫిల్మ్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది మూడు సినిమాల కాంట్రాక్ట్. అందులో రెండు పూర్త‌య్యాయి. శుద్ధ్ దేశీ రొమాన్స్- డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి రిలీజైనా మూడవ చిత్రం పానీ శేఖర్ కపూర్ ద‌ర్శ‌క‌త్వంలో చేయాల్సిన‌ ఒక పెద్ద ప్రాజెక్ట్. అయితే కపూర్-ఆదిత్య చోప్రా మధ్య సృజనాత్మక వ్యత్యాసాల కారణంగా ఇది తెర‌కెక్క‌లేదు. ఈలోగానే ప‌ద్మావ‌త్ ఆఫ‌ర్ కోల్పోయాడు.

ఫితూర్ ఆఫ‌ర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కు ఇచ్చింది. కాని అతను బిజీగా షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆఫర్‌ను తిరస్కరించాడు. కొన్ని ఆఫ‌ర్లు పోవ‌డం వెన‌క పెద్ద‌ల హ‌స్తం ఉంద‌ని అప్ప‌ట్లో ఓ ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. సుశాంత్ పై జ‌రిగిన కుట్ర‌ల‌పై పానీ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌పూర్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

సుశాంత్ చివరి చిత్రం నితేష్ తివారీ దర్శకత్వం వహించిన చిచోర్ 2019 సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ నాయిక‌. ఇది జీవితాన్ని వదులుకోవడంపై సెటైరిక‌ల్ క‌థ‌తో తెర‌కెక్కింది. కానీ అత‌డు వ‌దులుకున్నాడు. 14 జూన్ 2020 న సుశాంత్ (34) బాంద్రాలోని ఒక భవనంలో తన డ్యూప్లెక్స్ అద్దె ఫ్లాట్ లో ఉరివేసుకున్నాడు. దేశంలోని మూడు ప్రధాన ఏజెన్సీలు - సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)- నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) - సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ‌ల‌వ‌న్మ‌రణ కేసులో దర్యాప్తు జరుపుతున్నాయి. కానీ ఏ దర్యాప్తులోనూ ఏదీ బయటపడలేదు.