Begin typing your search above and press return to search.
సుశాంత్ కేసు: తాజా పోస్టు మార్టం రిపోర్ట్ తేల్చిందిదే
By: Tupaki Desk | 28 July 2020 10:10 AM GMTఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించిన అసలు కారణాలు తెలిపే పోస్టుమార్టం రిపోర్ట్ తాజాగా బయటపడింది. దాంతో పాటు మహేష్ భట్ విచారణ పూర్తికాగా.. కరణ్ జోహార్ కు తాజాగా నోటీసులు పంపడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎలా మరణించాడనే దానిపై తాజాగా ‘విసేరా’ పోస్టుమార్టం రిపోర్టులు ముంబై పోలీసులకు అందాయి. ఆయన మరణానికి సంబంధించిన కీలక రిపోర్టులో సుశాంత్ ఊపిరి అందకపోవడం వల్లే మరణించారనే విషయం మరోసారి స్పష్టమైంది. మరికొన్ని పోస్టుమార్టం రిపోర్టులు అందిన తర్వాత ముంబై పోలీసులు ఈ సుశాంత్ కేసులో ఏదైనా కుట్ర జరిగిందా అనే దానిపై అసలు నిజాలు వెల్లడించనుంది. కీలకమైన ముంబైలోని ‘కలీనా’ ల్యాబ్ రిపోర్టులు రావాల్సి ఉంది.
ఇక సుశాంత్ కేసులో దర్శక నిర్మాత కరణ్ జోహర్ కు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసును మరింత సీరియస్ గా పోలీసులు విచారిస్తున్నారు. సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కరణ్ జోహర్ ను ప్రశ్నించనుడడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.