Begin typing your search above and press return to search.

సుశాంత్‌ : ముంబయి పాట్నా పోలీసుల మద్య మరో చిచ్చు

By:  Tupaki Desk   |   3 Aug 2020 6:50 AM GMT
సుశాంత్‌ : ముంబయి పాట్నా పోలీసుల మద్య మరో చిచ్చు
X
సుశాంత్‌ ఆత్మహత్య కేసులో ముంబయి పోలీసులు బాలీవుడ్‌ వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే చాలా మందిని ముంబయి పోలీసులు విచారించినా కూడా ఏమాత్రం కేసు విషయంలో ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలోనే బీహార్‌ పోలీసులకు సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ ఫిర్యాదు చేయడంతో విచారణ వేగవంతం అయ్యింది. పాట్నా పోలీసులు ఇప్పటికే పలు విషయాలను రాబట్టారు. సుశాంత్‌ ఆత్మహత్యలో రియా పాత్ర కీలకంగా ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పాట్నా పోలీసులు ఆ దిశగా ముంబయికి చేరి విచారణ చేపడుతున్నారు.

పాట్నా పోలీసులకు ముంబయి పోలీసులు ఏమాత్రం సహకరించడం లేదని కేసుకు సంబంధించిన గత వివరాలను ఇవ్వడం లేదు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పాట్నా నుండి ముంబయికి సుశాంత్‌ కేసు విచారించేందుకు వెళ్లిన సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ వినయ్‌ తివారీని ముంబయి మున్సిపల్‌ అధికారులు అడ్డుకున్నారు. వారు క్వారెంటైన్‌ ముద్ర వేయడంతో ముంబయి పోలీసులు తివారీని నిర్బందంలో ఉంచారు. ఈ విషయాన్ని బీహార్‌ డీజీపీ ట్విట్టర్‌ లో తెలియజేస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ ను క్వారెంటైన్‌ ముద్ర వేసి నిర్బంధించడం ఏంటీ అంటూ డీజీపీ ప్రశ్నించారు. ఆయనకు సరైన వసతులు కూడా కల్పించకుండా ఇబ్బంది పెట్టడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అంటూ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే ట్వీట్‌ లో పేర్కొన్నాడు. సుశాంత్‌ కేసు లో ముంబయి పోలీసులు ఎవరినో కాపాడేందుకు ఇలా చేస్తున్నారు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తివారీ క్వారెంటైన్‌ తో రెండు రాష్ట్రాల మద్య వివాదం మరింతగా ముదిరే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.