Begin typing your search above and press return to search.

సుశాంత్‌ : సీబీఐ వారైనా అంతే అంటున్న ముంబయి పోలీసులు

By:  Tupaki Desk   |   8 Aug 2020 5:30 PM GMT
సుశాంత్‌ : సీబీఐ వారైనా అంతే అంటున్న ముంబయి పోలీసులు
X
సుశాంత్‌ రాజ్‌ పూత్‌ మృతి కేసు విచారణ విషయంలో ముంబయి పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఆయన మృతిని సహజమైన ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారని బాలీవుడ్‌ లో ఎవరినో వారు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. బీహార్‌ పోలీసుల ఎంట్రీతో ఆ విషయం తేటతెల్లం అయ్యింది. ముంబయిలో బీహార్‌ పోలీసులు సుశాంత్‌ కేసు విచారించేందుకు వెళ్లగా అక్కడ వారికి ఏమాత్రం సహకరించక పోవడంతో పాటు ముంబయికి మరో రాష్ట్రం నుండి వచ్చారంటూ ఏకంగా బీహార్‌ ఐపీఎస్‌ కు క్వారెంటైన్‌ ముద్ర వేశారు.

ఆ విషయమై బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ స్పందించాల్సి వచ్చింది. రెండు రాష్ట్రాల మద్య గొడవగా ముదురుతున్న సమయంలో కేసును కేంద్రం సీబీఐకి అప్పగించింది. ఈ కేసును ఎంక్వౌరీ చేసేందుకు ముంబయికి దిల్లీ నుండి సీబీఐ అధికారులు చేరుకునేందుకు రెడీ అవుతున్న సమయంలో ముంబయి పోలీసులు మరియు నగర పాలక సంస్థ అధికారులు నిర్మొహమాటంగా ఎవరు వచ్చినా కూడా క్వారెంటైన్‌ కు సిద్దపడి రావాలంటున్నారు. ముంబయిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బయట నుండి వచ్చే వారు 14 రోజుల క్వారెంటైన్‌ తప్పనిసరి అంటున్నారు. కేసులే లేకుంటే క్వారెంటైన్‌ చేయాలి. కాని ముంబయిలో లక్షల కేసులు నమోదు అయ్యాయి ఇంకా అవుతున్నాయి.

ఇలాంటి సమయంలో ఐపీఎస్‌ మరియు సీబీఐ అధికారులను క్వారంటైన్‌ చేయడం అంటే ఖచ్చితంగా ఇది కేసు విషయంలో తప్పు దోవ పట్టించడమే అంటూ అనుమానించాల్సి వస్తుందని నెటిజన్స్‌ మహా ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. మహా సీఎం తనయుడు ఈ కేసు విషయంలో ఇన్వాల్వ్‌ అవుతున్నాడు అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏంటీ అనేది సీబీఐ రంగ ప్రవేశంతో తేలిపోనుంది. కాని సీబీఐ వారికి కూడా ముంబయి ఎంట్రీ లేకుండా చేశారు. మరి కేంద్రం నుండి ప్రత్యేక అనుమతులు తీసుకుని సీబీఐ వారు ఏమైనా ప్రయత్నిస్తారేమో చూడాలి.