Begin typing your search above and press return to search.
#సుశాంత్.. బిగ్గరగా కేకలు వేస్తూ గోల పెట్టేవాడట
By: Tupaki Desk | 12 Aug 2020 5:15 AM GMTసుశాంత్ సింగ్ కేసులో ఒక్కో మలుపు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు సహా ఈడీ దర్యాప్తులో బోలెడన్ని ఆసక్తికర విషయాలు బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఇక ఈ కేసులో అన్ని వేళ్లు రియా చక్రవర్తి వైపే చూపిస్తున్నాయి. కానీ రియా వెర్షన్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. తనకు ఏమీ తెలీదని సుశాంత్ పూర్తి డిప్రెషన్ లో ఉండి ఆత్మహత్యకు పాల్పడ్డాడని రియా కన్నీటిపర్యంతమై మీడియాల కెక్కుతోంది. సుశాంత్ కుటుంబీకుల సాధింపులు తగదని కూడా అంటోంది. ఇందులో నిజం ఎంత? అన్నది సీబీఐ నిగ్గు తేల్చాల్సి ఉండగా.. తాజాగా రియా చెప్పిన కొన్ని సంగతులు నిశ్చేష్ఠులనే చేస్తున్నాయి.
సుశాంత్ కి 2019లోనే డిప్రెషన్ తీవ్ర స్థాయికి చేరుకుందని రియా వెల్లడించింది. సుశాంత్.. బిగ్గరగా కేకలు వేస్తూ గోల పెట్టేంత తీవ్ర స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొన్నాడని రియా తాజాగా వెల్లడించడం షాకిస్తోంది. రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో కలిసి తన 2019 యూరప్ యాత్రకు వెళ్లిందట. ఇటలీలోని ఫ్లోరెన్స్ పర్యటనలో ఉన్నపుడే తనలో మానసిక అనారోగ్య సంకేతాలను చూసానని తెలిపింది. గోడలపై పురాతన పెయింటింగ్ లు ఉన్న 600 సంవత్సరాల నాటి `హెరిటేజ్ హోటల్`లో వారు బస చేసారట. సాటర్న్ తన బిడ్డను మ్రింగివేస్తున్నట్లు చూపించిన ఒక ప్రత్యేకమైన పెయింటింగ్ చూసిన తర్వాత సుశాంత్ భ్రమపడ్డాడని.. తన సోదరుడితో కలిసి ఆ సమయంలో అక్కడే ఉన్నానని రియా తెలిపింది.
సుశాంత్ అనారోగ్యం కారణంగా తమ యాత్రను ఎలా కుదించుకోవాల్సి వచ్చిందో రియా తెలిపింది. ముంబైకి తిరిగి వచ్చిన తరువాత దివంగత నటుడి పరిస్థితి మరింత దిగజారిందట. సుశాంత్ బిగ్గరగా అరవడం.. కేకలు వేయడం.. కొన్నిసార్లు ఏడవడం చేసేవాడట. అప్పటికే సుశాంత్ మానసిక రోగానికి చికిత్స సాగుతోంది. తనకు సహాయం చేసే క్రమంలో తాను కూడా డిప్రెషన్ లో పడ్డానని రియా వెల్లడించింది.
జూన్ 8 తర్వాత తనకోసం ఒక మానసిక వైద్యుడి అపాయింట్ మెంట్ కోరామని రియా వెల్లడించింది. అంతే కాదు.. జూన్ 14 న సుశాంత్ మరణం గురించి విన్నంత వరకు అతడు తన గది నుండి బయటకు రాలేదని కూడా చెప్పింది. సుశాంత్ జూన్ 10 న షోయాక్ చక్రవర్తికి రియా గురించి అడగడానికి ఒక టెక్స్ట్ పంపారట. రియా చెబుతున్న ఈ విషయాలన్నీ నమ్మాలా వద్దా? ఇందులో ఫిక్షన్ ఎంత..? నాన్ ఫిక్షన్ ఎంత? ఇవన్నీ నిజాలా కాదా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది.