Begin typing your search above and press return to search.
#సుశాంత్.. 48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే..!
By: Tupaki Desk | 12 Aug 2020 9:10 AM GMT48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కి వార్నింగ్ అందింది. సుశాంత్ కుటుంబీకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందున సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంధువు నీరజ్ రౌత్ కు లీగల్ నోటీసు పంపారు.రౌత్ నోటికొచ్చింది వాగారు.. 48 గంటల్లో సుశాంత్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని లేదా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్ని ఉంటుందని నోటీసుల్లో హెచ్చరించారు.
శివసేన నేత సంజయ్ రౌత్ ఇటీవల సుశాంత్ తండ్రికి వ్యతిరేకంగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసలు సుశాంత్ సింగ్ తన తండ్రి నుంచి ఎందుకు దూరంగా ఉన్నారు? తను పాట్నా వస్తున్నారా? అంటూ మీడియా ముందు నిలదీసే ప్రయత్నం చేశారు. దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి.. అతడి తండ్రి గురించిన వాస్తవాలు తెలియకుండానే రౌత్ నిరాధారమైన విషయాలు మాట్లాడారని ఆయన అన్నారు. బీహార్ డీజీపీ సహా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పైనా ఇలాంటి అన్ పార్టమెంటరీ భాషను ఉపయోగించడం సంజయ్ కి అలవాటు. సంఘంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలా చేయకూడదని సుశాంత్ బంధువు పాండే దుయ్యబట్టారు.
ఈ వివాదం ఇలా ఉండగానే... రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీం పరిశీలించి విచారించేందుకు సిద్ధమవుతోంది. ఈ కేసులో ప్రతివాదులు అయిన కేంద్రం.. బీహార్.. మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆగస్టు 13 లోగా కోర్టు ముందు వాస్తవాల సంకలనాన్ని.. అలాగే అన్ని ముందస్తు తీర్పుల లిఖితపూర్వక నోట్ ను దాఖలు చేయాలని సుప్రీంకోర్టు కోరింది.