Begin typing your search above and press return to search.

# సుశాంత్ మిస్ట‌రీ.. రియా ప్ర‌మాద‌క‌ర డ్ర‌గ్స్ ప్ర‌యోగించిందా?

By:  Tupaki Desk   |   26 Aug 2020 5:45 AM GMT
# సుశాంత్ మిస్ట‌రీ.. రియా ప్ర‌మాద‌క‌ర డ్ర‌గ్స్ ప్ర‌యోగించిందా?
X
సుశాంత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం కేసులో చిక్కుముడులు వీడ‌డం లేదు. ప్రేయ‌సి రియా చ‌క్ర‌వ‌ర్తి మెడ‌కు అంతకంత‌కు ఉచ్చు బిగుసుకుంటూనే ఉంది. కేసును లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ ప్ర‌స్తుతం ఒక్కో చిక్కుముడి విప్పే ప‌నిలో ఉంది. ఇక ఇందులో మ‌రో కొత్త ట్విస్టు అగ్గి రాజేస్తోంది. అదే రియాకు డ్ర‌గ్ డీల‌ర్ల‌తో స‌త్సంబంధాలు... డ్ర‌గ్స్ కొనుగోళ్ల‌కు సంబంధించిన వాట్సాప్ మెసేజ్ లు హీట్ పెంచేస్తున్నాయి. నిషేధిత మాద‌క ద్ర‌వ్యాల్ని రియా చ‌క్ర‌వ‌ర్తి కొనుగోలు చేసేదన్న నిజం నిగ్గు తేలింది. ఇక వాటిని సుశాంత్ కోసం వినియోగించి అత‌డి ఆరోగ్యాన్ని పాడు చేసిందా? సుశాంత్ డిప్రెష‌న్ కి కార‌ణ‌మేమిటి? అన్న కోణంపై సీబీఐ ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. మాద‌క ద్ర‌వ్యాల కొనుగోలు స‌హా సుశాంత్ విష‌యంలో కుట్ర కోణంపై ప్ర‌స్తుతం ఆరాలు కొన‌సాగుతున్నాయి.

తాజాగా డ్రగ్ డీలర్ తో రియా వాట్సాప్ సంభాషణ హీటెక్కిస్తోంది. డ్రగ్ డీలర్ గౌరవ్ ఆర్యతో సంభాష‌ణ‌లో నిషేధిత మిథైలెండిక్సీ మీతమ్ ‌ఫెటామైన్ అనే ప్రమాదకర మాద‌క ద్ర‌వ్యాన్ని రియా అడిగింది. ``హైప‌వ‌ర్ డ్రగ్స్ గురించి సమాచారం కావాలి... అలాంటివి ఎప్పుడూ వాడలేదు`` అంటూ రియా కోట్ చేస్తూ స‌ద‌రు డ్రగ్ డీల‌ర్ ని అడిగింది. 2017లో చాట్ అయినా దీని వెన‌క ఇంకేదైనా కుట్ర‌కోణం దాగి ఉందా? అన్న విచార‌ణ సాగుతోంది.

అలాగే స్మాల్ టైమ్ యాక్ట‌ర్ జ‌య సాహాతోనూ డ్ర‌గ్స్ కి సంబంధించిన చ‌ర్చ వేడెక్కిస్తోంది. డ్రగ్స్ బాగా పనికి వచ్చాయా? అంటూ రియాను ప్ర‌శ్నించ‌డం ఆ చాట్ లో బ‌య‌ట‌ప‌డింది. అంతేకాదు.. డ్ర‌గ్స్ విష‌యంలో శృతిని కోఆర్డినేట్ చేయమని అడిగాను.. చాలా ధ‌న్య‌వాదాలు! అంటూ రియా సందేశాన్ని పంపింది. ఇక డ్ర‌గ్ దందాతో రియా సోద‌రుడి లింకులు బ‌య‌ట‌ప‌డ‌డం మ‌రో కొత్త కోణం. సుశాంత్ ఇంటి సిబ్బంది శామ్యూల్ మిరాండాతో రియా చక్రవర్తి జరిపిన మరో మెసేజ్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కూడా డ్ర‌గ్స్ విష‌య‌మై జ‌రిగిన సంభాష‌ణ కావ‌డంతో వారిని సీబీఐ విచారిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ రియాను సీబీఐ ప్ర‌శ్నించ‌లేదు. ఇక‌పై డ్ర‌గ్స్ కోణంలో ప్ర‌శ్నల్ని తాను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈడీ బ్యాంక్ అధికారుల నుంచి స‌మ‌స్థ స‌మాచారం చేజిక్కించుకున్న సీబీఐ ర‌క‌ర‌కాల కోణాల్లో ద‌ర్యాప్తు సాగించ‌నుంది. అలాగే వాటర్ ‌స్టోన్ రిసార్టులో సుశాంత్‌కు అధ్యాత్మిక చికిత్స గురించి సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. పితాని.. నీరజ్ ‌ను సీబీఐ అధికారులు గత మూడు రోజులుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇందులో ర‌క‌ర‌కాల నిజాలు బ‌య‌ట‌పడే ఛాన్సుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.