Begin typing your search above and press return to search.

సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణం.. రియా సేఫ్

By:  Tupaki Desk   |   2 Sep 2020 5:15 AM GMT
సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణం.. రియా సేఫ్
X
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సీబీఐ విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నట్టు సమాచారం. కొన్ని వాట్సాప్ చాట్స్ బయటపడిన తరువాత ఈ కేసులో డ్రగ్స్ కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) రంగంలోకి దిగి ఈ కేసులో డ్రగ్స్ వల్లే సుశాంత్ మరణం సంభవించిందా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించింది.

మీడియా నివేదికల ప్రకారం.. డ్రగ్స్ రాకెట్ లో కీలక నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందులో ఒకడు రియా సోదరుడు షోయిక్ పేరు బయటపెట్టాడు. అంతేకాదు.. అతడిని గుర్తుపట్టాడు. దీంతో సుశాంత్ మరణానికి సంబంధించిన ఈ కేసులో పూర్తి స్థాయి ‘డ్రగ్స్ ’కు సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

నిన్న సాయంత్రం ఇద్దరు డ్రగ్ సరఫరాదారులను ఎస్.సీ.బీ అరెస్ట్ చేసింది. మూడున్నర కిలోల డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో పార్టీల కోసం తీసుకొచ్చినట్టు వారు అంగీకరించారు.

ఈ కేసులో, ఎన్‌సిబి అధికారులు ముంబై, ఢిల్లీలో పలు చోట్ల తక్షణ దాడులు జరిపారు. రెండు పెద్ద మాల్స్ ను సీజ్ చేశారు. డ్రగ్స్ ముఠా సుశాంత్ మరణం తర్వాత వీటిని మూసివేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

సుశాంత్ మరణంపై రియాను నాలుగోరోజు విచారించారు. సుశాంత్ ను హత్య చేసినట్టు సీబీఐకి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సుశాంత్ ఆత్మహత్యకు కారణాలను వెదికే పనిలో సీబీఐ ఉంది.

సుశాంత్ మానసిక సమస్యతో బాధపడుతున్న సుశాంత్.. ఈ మధ్య తను తీసుకుంటున్న మెడిసన్ కు మార్చాడని కీలక విషయం చెప్పింది. రియాకు సుశాంత్ మరణంలో ప్రమేయ లేదని తేలినట్టు ప్రచారం జరుగుతోంది.