Begin typing your search above and press return to search.

#సుశాంత్ సింగ్ హ‌త్య‌? ఆస్ప‌‌త్రిలోనే జంత‌ర్ మంత‌ర్?

By:  Tupaki Desk   |   7 Sep 2020 3:20 AM GMT
#సుశాంత్ సింగ్ హ‌త్య‌? ఆస్ప‌‌త్రిలోనే జంత‌ర్ మంత‌ర్?
X
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం పై సీబీఐ విచార‌ణ చేప‌ట్టి శ‌ర‌వేగంగా దర్యాప్తును సాగిస్తోంది. ఈ కేసులో జ‌‌ఠిల‌మైన ఎన్నో‌ కీల‌క విష‌యాల్ని రోజు రోజుకీ బ‌య‌ట‌కి తీస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే చాలా మందిని విచారించిన సీబీఐ కీలక ఆధారాల‌పై దృష్టి సారించిన‌ట్టు క‌నిపిస్తోంది. సుశాంత్ బాడీ పోస్ట్ మార్ట‌మ్ జ‌రిగింది కూప‌ర్ ఆసుప‌త్రిలో. ఇక్క‌డి నుంచే కేసు కీల‌క మ‌లుపు తిర‌గ‌బోతోంద‌ని తెలుస్తోంది. అదీ కాకుండా సుశాంత్ మృత దేహం మెడ భాగంపై గాట్లు వున్నాయ‌ని ద‌ర్యాప్తులో తేలినట్టుగా మీడియా క‌థ‌నాలు చెబుతున్నాయి. దీనిపై పోస్ట్ మార్ట‌మ్ నిర్వ‌హించిన డాక్ట‌ర్ల‌ని సీబీఐ విచారించ‌డం మొద‌లుపెట్టింది.

కూప‌ర్ ఆసుత్రిలో సుశాంత్ బాడీకి లేట్ గా పోస్ట్ మార్ట‌మ్ జ‌రిగింది. ఈ ఆల‌స్యానికి కార‌ణం ఏంటీ? ఎందుకు ఆల‌స్యం చేశారు? అనే విష‌యాల‌ని సీబీఐ ఆరాతీస్తోంద‌ట‌. ఇప్ప‌టికే దీనిపై మీడియాలో భిన్న క‌థ‌నాలు వినిపించాయి. ఇవి ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అనే దానిపై కూడా సీబీఐ విచారిస్తోంద‌ట‌. అంతే కాకుండా సుశాంత్ బాడీపైనా మెడ‌పైనా కొన్ని మార్క్స్ వున్నాయి. అవేంటీ? ఎవ‌రు పెట్టారు? అన్న‌దానిపైనా ఆరా తీస్తోంది సీబీఐ.

ఈ కోణంలో ఏయిమ్స్ కు చెందిన ఫోరెన్సిక్ టీమ్ కూడా ఆధారాలు సేక‌రిస్తోంది. ఇప్ప‌టికే సుశాంత్ ఇంటిని సందర్శించి ఫోరెన్సిక్ టీమ్ ప‌లు కీల‌క ఆధారాల్ని సేక‌రించిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. విధ కోణాల్లో ఈ కేసుని ప‌రిశీలించిన సీబీఐ మూడ‌వ స్టేజ్ ‌కి తీసుకొ‌చ్చేసింద‌ని సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడ‌న్న వాద‌న‌లో ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేద‌ని.. అది కేవ‌లం పైకి జ‌రిగిన ప్ర‌చారం మాత్ర‌మేన‌ని సీబీఐ వ‌ర్గాలు ఓ నిర్థార‌ణ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే ప‌లువురు కీల‌క వ్య‌క్తుల్ని అరెస్ట్ చేయ‌డంలో త్వ‌ర‌లోనే సుశాంత్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ వీడే అవ‌కాశం వుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.