Begin typing your search above and press return to search.
సుశాంత్ పై డ్రగ్స్ తో పాటు మరో ఆరోపణ
By: Tupaki Desk | 8 Sep 2020 3:45 AM GMTబాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ బతికి ఉన్నంత కాలం గుడ్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. కాని ఎప్పుడైతే అతడు చనిపోయాడో అప్పటి నుండి రకరకాలుగా ఆయన గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. మొదట సుశాంత్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడేమో అంటూ వ్యాఖ్యలు వినిపించాయి. చివరకు రియా వల్లే సుశాంత్ మృతి చెందాడు అంటూ ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సీబీఐ వారు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ కు సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఎంత చెడ్డ వారు అయినా చనిపోయిన తర్వాత మంచి వారే అని వారి మంచి గురించి మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే సుశాంత్ విషయంలో మాత్రం రివర్స్ జరుగుతోంది. సుశాంత్ మృతికి కారణం ఏంటో ఇంకా తెలియకుండానే ఆయన డ్రగ్స్ తీసుకునే వాడు అంటూ నిర్థారణ అయ్యింది. తానే స్వయంగా సుశాంత్ కోసం డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్లుగా రియా పేర్కొంది. ఇప్పుడు మరో నేరారోపణ గురించి సుశాంత్ కు సంబంధించి కుటుంబ సభ్యులను కలవర పెడుతోంది.
మాజీ మేనేజర్ దిశా మృతి చెందిన తర్వాత బాగా ఆందోళన పడేవాడని.. ఎప్పుడు ఆ విషయంలో లాయర్ తో మాట్లాడుతూ ఉండేవాడు అంటూ విచారణలో వెళ్లడయ్యింది. అంటే దిశా మృతితో సుశాంత్ కు సంబంధం ఉందా అందుకే లాయర్ తో పదే పదే మాట్లాడటంతో పాటు ఆందోళన పడేవాడు అంటూ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో దిశా మృతితో సుశాంత్ కు సంబంధంను క్రియేట్ చేసినట్లుగా చెబుతున్నారు. సుశాంత్ గురించి మరెన్ని ఆరోపణలు వినాల్సి వస్తుందో అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.