Begin typing your search above and press return to search.
సుశాంత్ సోదరిని కొత్త కేసులో ఇరికించిన రియా
By: Tupaki Desk | 8 Sep 2020 4:00 AM GMTబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత అందరికి రియా టార్గెట్ అయ్యింది. ముఖ్యంగా సుశాంత్ కుటుంబ సభ్యులు రియా వల్లే అతడు మృతి చెందాడు అంటూ ఆరోపిస్తున్నారు. సుశాంత్ కేసును సీబీఐ ఎంక్వౌరీ చేయడం వల్ల రియా గురించిన బండారం బయట పడుతుందని రాజ్ పూత్ కుటుంబం చెప్పుకొచ్చింది. వారి కోరిక మేరకు సుశాంత్ మృతి వివరాలను తెలుసుకునేందుకు సీబీఐ ఎంక్వౌరీ వేయడం జరిగింది. అయితే ఈ సమయంలో సుశాంత్ సింగ్ కు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
సీబీఐ వారు రియాను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున సుశాంత్ సోదరిపై కొత్త కేసు నమోదు అయ్యింది. సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ తప్పుడు ప్రిస్కిప్షన్ ఇచ్చిందని డాక్టర్ సైన్ ను ఫోర్జరీ చేసి అక్రమంగా నిషేదిత ఔషదాలను సుశాంత్‌కు ఇచ్చింది అంటూ ప్రియంక సింగ్ పై రియా చక్రవర్తి ఫిర్యాదు చేసింది. ప్రియాంక పై చీటింగ్ తో పాటు ఫోర్జరీ మరియు నిషేదిత ఔషదాల వినియోగం వంటి కేసులను రియా పెట్టింది. అందుకు సంబంధించిన ప్రియాంక వాట్సప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ ను విడుదల చేయడం జరిగింది. సుశాంత్ కు ప్రియాంక ఆ తప్పుడు ప్రిస్కిప్షన్ ను పంపించడం ఆ వాట్సప్ చాటింగ్ లో ఉంది. కను దీనిని పరిగణలోకి తీసుకుని ప్రియాంకపై కేసు నమోదు చేయాలంటూ రియా డిమాండ్ చేసింది.
ప్రియాంక ఆ తప్పుడు మెడిసిన్స్ ఇచ్చిన అయిదు రోజుల్లోనే సుశాంత్ మృతి చెందాడు. ఆయన మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేసి విచారించాలంటూ రియా కోరింది. ముంబయి పోలీసులు రియా ఫిర్యాదును స్వీకరించారు. ఆమె వాదించిన పాయింట్లు ఆమోదయోగ్యంగా ఉన్న కారణంగా ప్రియాంకపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ప్రియాంక సింగ్ ను రియా ఇరికించడంపై సుశాంత్ అభిమానులు తప్పుబడుతున్నారు. ఆమె తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది అంటూ అసహనం వ్యక్తం చేశారు.