Begin typing your search above and press return to search.
#సుశాంత్ తో కలిసే రియా ఏకంగా డ్రగ్ సిండికేట్ రన్ చేసేదట!!
By: Tupaki Desk | 9 Sep 2020 6:30 AM GMTసుశాంత్ సింగ్ బలవన్మరణం కేసులో రియా చక్రవర్తి మెడకు ఉచ్చు బిగిసిన సంగతి తెలిసిందే. తీగ లాగితే డొంకంతా కదులుతోంది. డ్రగ్ సిండికేట్ గూటం కదిలిపోతోంది. సీబీఐ-నార్కోటిక్స్ బృందాలు ఆచి తూచి అడుగులు వేస్తూ పిన్ టు పిన్ ప్రతిదీ జల్లెడ పడుతున్నాయి. బాలీవుడ్ డ్రగ్స్ తో మిలాఖత్ అయిన తీరు తెన్నుల్ని తీగ పట్టుకుని కుదిపేస్తున్నారు అధికారులు. ఇందులో రియా చెప్పినట్టు 26 మంది సినీపెద్దలే కాదు ఏకంగా బాలీవుడ్ లో డ్రగ్స్ తో లింకప్ అయి ఉన్న చాలా మంది బయటపడే ఛాన్సుందని అంచనా వేస్తున్నారు.
ఇక ఈ కేసులో మరో షాకింగ్ విషయం నిశ్చేష్ఠులనే చేస్తోంది. ఇక రియా చక్రవర్తి `డ్రగ్ సిండికేట్` క్రియాశీల సభ్యురాలు అని తేలింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో కలిసి మాదక ద్రవ్యాల సేకరణ కోసం ఫైనాన్స్ చేసేదని ఎన్.సి.బి వర్గాలు చెబుతుంటే షాక్ తినాల్సిన పరిస్థితి తలెత్తింది. రియా చక్రవర్తిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ఎన్.సి.బి `డ్రగ్స్ ప్రొక్యూర్ మెంట్ లో లోతుపాతుల్ని నిగ్గు తేల్చింది.
తాను `డ్రగ్ సిండికేట్` లో చురుకైన సభ్యురాలినని.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో పాటు మాదక ద్రవ్యాల సేకరణ కోసం ఫైనాన్స్ నిర్వహణకు డబ్బును ఖర్చు చేసేదానినని స్వయంగా రియా చక్రవర్తి అంగీకరించిందట. ఆ మేరకు ఎన్.సి.బి షాకింగ్ విషయాల్ని వెల్లడిస్తుంటే సుశాంత్ అభిమానులు జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది.
ఇంతకుముందే.. రియా చక్రవర్తి ముంబైలోని ఎన్.సి.బి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. కోర్టు ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించి.. బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.
డ్రగ్స్ - ఆర్ధిక లావాదేవీల సేకరణలో తన ప్రమేయం గురించి రియా చక్రవర్తి వెల్లడించింది. డ్రగ్ సిండికేట్ సభ్యులైన దీపేశ్ సావంత్- షోయిక్ చక్రవర్తి - మిరండాకు ఆమె సూచనలు కూడా చేసేదట. ఔషధాల సేకరణ నిర్వహణలో సావంత్ పాత్రను ఎన్.సి.బి ఆరా తీసి అరెస్టు చేసింది. ఇదే కేసులో షోయిక్- మిరాండాలను కూడా అరెస్టు చేశారు.
ఎన్.సి.బి రిమాండ్ కాపీ ప్రకారం రియా చక్రవర్తి ఇతర నిందితుల వాంగ్మూలాలను అంగీకరించింది. ఆమె సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అవసరాల కోసం మాదక ద్రవ్యాలను సేకరించేది అని స్పష్టమైంది. ఇదొక్కటే కాదు.. ఇంకో షాకింగ్ విషయం తెలిసింది. డ్రగ్ ఔషధాల కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక సమస్యలను కూడా రాజ్‌పుత్- చక్రవర్తి కలిసి చాకచక్యంగా పరిష్కరించుకునేవారని సావంత్ చెప్పినట్లు పేర్కొంది. కైజెన్ ఇబ్రహీం ద్వారా దీపీష్ సావంత్ (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సిబ్బంది) కు బాసిత్ పరిహార్ డ్రగ్స్ అందించాడని షోయిక్ నార్కోటిక్స్ అధికారులకు చెప్పారు.
జైద్, బాసిత్ మరియు కైజెన్ ద్వారా మాదక ద్రవ్యాల పంపిణీని సులభతరం చేయడానికి తాను ఉపయోగించానని షోయిక్ అంగీకరించినట్లు ఎన్.సిబి తెలిపింది. షోయిక్ దానిని వెల్లడించాడని కూడా ఇది హైలైట్ చేసింది. ఈ డ్రగ్ డెలివరీలను రాజ్ పుత్ సహాయంతో స్వీకరించేవారు. ప్రతి డెలివరీ మరియు చెల్లింపు రియా చక్రవర్తితో టచ్ లో ఉండగానే జరిగేదే. ఎన్.సి.బి రిమాండ్ దరఖాస్తు ప్రకారం.. మాదకద్రవ్యాల సేకరణకు సుశాంత్ కూడా ఆదేశించినట్లు శామ్యూల్ మిరాండా అంగీకరించాడు.
రియా చక్రవర్తితో పాటు ఈ డ్రగ్స్ ఔషధాలకు సంబంధించిన ఆర్థిక విషయాలను కూడా రాజ్ పుత్ స్వయంగా చూసుకునేవాడు. ఎన్‌సిబి ప్రకారం, .. తన (సుశాంత్) సూచనల మేరకు సుశాంత్ కోసం డ్రగ్స్ అందుకున్నట్లు దీపేష్ సావంత్ (సుశాంత్ స్టాఫ్) వెల్లడించాడు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ - రియా చక్రవర్తి సూచనల మేరకు తాను డ్రగ్స్ సేకరించేవాడని దీనికి సంబంధించి ఆర్థిక విషయాలను రియా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రిమాండ్ దరఖాస్తు ప్రకారం వ్యవహరిస్తున్నారని శామ్యూల్ మిరాండా ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఎన్.సిబి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నుండి అధికారిక సమాచార మార్పిడి అనంతరం దర్యాప్తు ప్రారంభించింది సీబీఐ. ఇందులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుకు సంబంధించి మాదకద్రవ్యాల వినియోగం- సేకరణ.. వినియోగం మరియు రవాణాకు సంబంధించిన వివిధ చాటింగుల వివరాలు ఉన్నాయి.