Begin typing your search above and press return to search.
ఇప్పుడు రియా.. 30 ఏళ్ల క్రితం రేఖ
By: Tupaki Desk | 14 Sep 2020 10:10 AM GMTసుశాంత్ ను ప్రేమించిన రియా ఇప్పుడు ఆయన ఆత్మహత్యకు కారణం అయ్యి ఉంటుంది అనే కోణంలో విచారణ సాగుతోంది. సుశాంత్ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఆమె వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు లేదంటే ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సుశాంత్ ను చంపించింది అంటున్నారు. ఈ కేసులో రియా పీకల్లోతు కూరుకు పోయింది. సుశాంత్ హీరో అవ్వడం వల్ల ఆమెపై ఒత్తడి కూడా తీవ్రంగా ఉంది. ప్రస్తుతం రియా ఏదైతే సమస్యను ఆరోపణలు ఎదుర్కొందో సరిగ్గా 30 ఏళ్ల క్రితం రేఖ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంది.
రేఖ ప్రేమించి ముఖేష్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఆయన వ్యాపారాల్లో నష్టం మరియు ఇతర్రత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. రేఖ డ్రస్ దుపట్టాతో ముఖేష్ ఉరి వేసుకుని మృతి చెంది ఉండటం వల్ల అతడి కుటుంబ సభ్యుల నుండి మొదలుకుని అంతా కూడా అతడి మృతికి కారణం రేఖ అంటూ ఆరోపించారు. పెళ్లి అయిన కేవలం ఏడు నెలల్లోనే అలా జరగడంతో రేఖ మీద అందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖేష్ చాలా డిప్రెషన్ తో బాధపడేవాడు. ఆయనకు ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ డిప్రెషన్ లో కనిపించేవాడు అంటూ రేఖ గతంలో పేర్కొంది.
1990, అక్టోబర్ 2న ముఖేష్ తన గదిలోనే రేఖ చున్నీతో ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు ఆయన బంధు మిత్రులు అంతా కూడా అసలు ముఖేష్ కు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడారు. రేఖ ను పెళ్లి చేసుకున్న తర్వాత అతడి మనశ్శాంతి కోల్పోయాడు. అందుకే అతడు మృతి చెందాడు అంటూ రేఖను విమర్శిస్తూ ఆరోపించిన వారు చాలా మంది ఉన్నారు. అప్పుడు రేఖ ఎదుర్కొన్న ఆరోపణలు మరియు విమర్శలు ఇప్పుడు రియా కూడా ఎదుర్కొంటుంది అంటూ సమీనా షేక్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దాంతో పాత విషయాలు మళ్లీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.