Begin typing your search above and press return to search.

సుశాంత్ కేసులో ఫేక్ ఐడీ ట్విట్టర్ గ్యాంగ్ ని ప్రశ్నించిన స్వామి..!

By:  Tupaki Desk   |   6 Oct 2020 10:50 AM GMT
సుశాంత్ కేసులో ఫేక్ ఐడీ ట్విట్టర్ గ్యాంగ్ ని ప్రశ్నించిన స్వామి..!
X
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ ఆత్మహత్య చేసుకుని మరణించాడని ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీబీఐకి ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ సుధీర్ గుప్తా మాట్లాడుతూ.. సుశాంత్ ఉరి వేసుకున్నట్టు తప్ప శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. అయితే ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా ఆగష్టు 22న రిపబ్లిక్ టీవీతో మాట్లాడుతూ సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టులో కొన్ని లోపాలున్నాయని.. కూపర్ హాస్పిటల్ నివేదికపై పలు ప్రశ్నలను లేవనెత్తారు. కానీ ఇప్పుడు సుధీర్ గుప్తా యూ టర్న్ తీసుకొని అతనిది ఆత్మహత్య అని పేర్కొనడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి.. డాక్టర్ సుధీర్ గుప్తా ఎయిమ్స్ టేప్ పై స్పందించారు.

సుబ్రమణియన్ స్వామి ఈ ఇష్యూ పై స్పందిస్తూ "భారతదేశ భవిష్యత్తు ప్రమాదంలో ఉంది" అని పేర్కొన్నారు. ఒక అనుమానాస్పద మరణం యొక్క కఠినమైన దర్యాప్తు కోసం ఎవరు ఆందోళన చెందడం లేదని ఆయన అన్నారు. ''భారతదేశం యొక్క భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. దారుణమైన విషయం ఏమిటంటే లుటియన్ గుంపు సంతోషంగా ఉంది. ఎందుకు? వారు దావూద్ డ్రగ్ బెన్ఫిషియరీలలో భాగమా లేదా ఫేక్ ఐడి ట్విట్టర్ ముఠాలో భాగమా?'' అని స్వామి ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. హత్య అనే కోణంతో సహా దర్యాప్తులోని అన్ని అంశాలను సూక్ష్మంగా పరిశీలిస్తున్నామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఒక ప్రకటన విడుదల చేసింది.