Begin typing your search above and press return to search.
సుశాంత్ కేసు: యూటర్న్ తీసుకున్న ప్రత్యక్ష సాక్షి...!
By: Tupaki Desk | 12 Oct 2020 7:45 AM GMTబాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు ఇన్ని రోజులైనా ఇంకా ఒక కొలిక్కిరాలేదు. అయితే ఎయిమ్స్ వైద్య బృందం అందించిన రిపోర్ట్ ప్రకారం సుశాంత్ ది ఆత్మహత్యే అని తేలింది. సుశాంత్ శరీరంలో ఎలాంటి విషం లేదని.. అది ఆత్మహత్యే అని ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ స్పష్టం చేసింది. కానీ ఈ కేసులో మరిన్ని అనుమానాలు కలిగించేలా సుశాంత్ మరణించాడనికి ముందురోజు సాయంత్రం సమయంలో సుశాంత్ రియా చక్రవర్తిని తన ఇంటి వద్ద డ్రాప్ చేసి వెళ్లాడని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షి ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల రియా పొరిగింటి మహిళ రిపబ్లిక్ టీవీతో మాట్లాడుతూ.. జూన్ 13న సాయంత్రం 6 - 6.30 గంటల మధ్య సుశాంత్ రియాను తన ప్లాట్ వద్ద వదిలి వెళ్లాడని ప్రత్యక్ష సాక్షి సీబీఐ ఎదుట హాజరై వెల్లడించినట్లు చెప్పింది. అయితే ఇప్పుడు సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన పొరుగింటి మహిళ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
సుశాంత్ సూసైడ్ కేసుని దర్యాప్తు చేస్తోన్న సీబీఐ ఎదుట ఎవరూ కూడా ఈ విషయంపై స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో తప్పుడు సమాచారంపై సీబీఐ ఆ మహిళను హెచ్చరించిందని తెలుస్తోంది. మరోవైపు మీడియా ఎదుట తప్పుడు ప్రకటనలు చేసే వారందరిపై న్యాయపరమైన చర్యలు చేపట్టాలని రియా తరపు న్యాయవాది సతీష్ మనేషిండే పేర్కొన్నారు. అలాంటి వారితో కూడిన జాబితాను సీబీఐకి అందచేస్తామని ఆయన వెల్లడించారు. కాగా జూన్ 14న సుశాంత్ ముంబయిలోని తన నివాసంలో విగత జీవిగా కనిపించారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడిని కాదని.. హత్య చేశారని అనేకమంది ఆరోపించారు. సుశాంత్ అకౌంట్లోని నుంచి రియాకు పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో సీబీఐ మరియు ఈడీ దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ కేసులో డ్రగ్స్ కోణం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా సహా పలువురిని అరెస్ట్ చేసింది. దాదాపు నెల రోజులు జైల్లో ఉన్న రియా.. ఇటీవల బెయిల్ పై విడుదలైంది.