Begin typing your search above and press return to search.

డ్రగ్స్‌ మానేయమన్నందుకే ఇద్దరి మద్య గొడవ

By:  Tupaki Desk   |   5 Nov 2020 4:30 AM GMT
డ్రగ్స్‌ మానేయమన్నందుకే ఇద్దరి మద్య గొడవ
X
బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ మృతికి సంబంధించిన విచారణ తుది దశకు చేరుకుంది. ఈ కేసులో రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదు అంటూ మరోసారి ఆమె తరపు లాయర్‌ సతీష్‌ మనేషిండే పేర్కొన్నాడు. రియా పరిచయం కాకముందు నుండే సుశాంత్‌ కు డ్రగ్స్‌ అలవాటు ఉండేది. మానసికంగా పరిస్థితి సరిగా లేని ఈ సమయంలో డ్రగ్స్‌ వాడకం అస్సలు మంచిది కాదు అంటూ రియా పదే పదే సుశాంత్‌ కు చెప్పేది. కాని ఆమె మాట ఎప్పుడు కూడా అతడు వినలేదు. మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతున్న నేపథ్యంలో వైధ్యులను సంప్రదించిన సుశాంత్‌ కు డ్రగ్స్‌ వాడకంను పూర్తిగా ఆపేయాలని సూచించారు. కాని డాక్టర్ల మాట కూడా అతడు వినలేదు.

సుశాంత్‌ రియాల మద్య విభేదాలకు ప్రధాన కారణం డ్రగ్స్‌ అంటూ లాయర్‌ చెప్పుకొచ్చాడు. ఆ విభేదాలే ఆమె ఇంటిని వదిలేలా చేశాయన్నాడు. సుశాంత్‌ ను పదే పదే డ్రగ్స్‌ మానేయమంటూ రియా కోరడం జరిగింది. అందుకే ఆమెను తన ఇంటి నుండి వెళ్లి పోవాల్సిందిగా సుశాంత్‌ కోరాడు. అందుకే ఆమె సుశాంత్‌ నుండి దూరంగా వెళ్లి పోవాల్సి వచ్చింది. ఆ సమయంలో సుశాంత్‌ కు ఆయన సోదరి ప్రియాంక తప్పుడు ప్రిస్క్రిప్షన్‌ ఇచ్చింది. ఆ మందులు వాడటం వల్ల అతడి మానసిక పరిస్థితి మరింతగా దిగజారి ఆత్మహత్య చేసుకున్నాడేమో అంటూ లాయర్‌ సతీష్‌ అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో రియా చక్రవర్తిని తప్పుపట్టాల్సింది ఏమీ లేదు అన్నట్లుగా ఆయన వాదిస్తున్నాడు.

సుశాంత్‌ తో డ్రగ్స్‌ మాన్పించేందుకు రియా వద్ద డ్రగ్స్‌ ఎందుకు పెట్టుకుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్‌ కేసులో రియా మరియు ఆమె సోదరుడు అరెస్ట్‌ అయిన విషయం తెల్సిందే. ఆ విషయం వివాదం కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో ఆమె తరపు లాయర్‌ మాట్లాడుతూ సుశాంత్‌ ను డ్రగ్స్‌ మాన్పించేందుకు రియా చాలా ప్రయత్నించింది అంటూ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ కొందను సుశాంత్‌ అభిమానులు మరియు కుటుంబ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.