Begin typing your search above and press return to search.
సుశాంత్ మరణంకు ముందురోజు కసబ్ గురించ చర్చ
By: Tupaki Desk | 22 Nov 2020 2:30 AM GMTబాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి చెంది నెలలు గడుస్తున్నా ఆయన తాలూకు జ్ఞాపకాల నుండి అభిమానులు బయటకు రాలేక పోతున్నారు. సీబీఐ ఎంక్వౌరీ చేస్తున్న నేపథ్యంలో ఏమైనా ఫలితం ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుశాంత్ ది ఆత్మహత్య కాదు అంటూ కుటుంబ సభ్యులు బలంగా నమ్ముతున్నారు. కాని పోలీసులు ఇప్పటికే ఆత్మహత్య అంటూ నిర్థారించగా సీబీఐ వారికి కూడా సుశాంత్ ది హత్య అంటూ నిరూపించుకునేందుకు ఆధారాలు లభించలేదు.
సుశాంత్ మృతిపై మీడియా వర్గాలు కూడా తమకు తాముగా సొంత ఎంక్వౌరీలు చేస్తున్నారు. జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే వారు వెళ్లడించిన ఒక విషయంను బట్టి చూస్తే సుశాంత్ మృతి చెందడానికి ఒక్కరోజు ముందు ఉగ్రవాది కబస్ పై సినిమాను చేసేందుకు ఒప్పుకున్నాడు. ఉదయ్ సింగ్ గౌరీ అనే వ్యక్తి ఈ ప్రాజెక్ట్ గురించి సుశాంత్ తో చర్చ జరిపినట్లుగా ఇండియా టుడేతో వెళ్లడించాడట. ఇప్పటి వరకు కసబ్ పై చాలా సినిమాలు వచ్చాయి.
సుశాంత్ కమిట్ అయిన మూవీ చాలా విభిన్నమైన నేపథ్యం. కసబ్ పాత్రను తీసుకుని కల్పిత కథతో కొన్ని అతడి జీవితంలోని ముఖ్య సంఘటనలు తీసుకుని సినిమా చేయాలనుకున్నారు. కథ విన్న వెంటనే సుశాంత్ ఒప్పుకున్నాడట. ఆ చర్చలు జరిగిన తర్వాత రోజే సుశాంత్ మృతి చెందడంతో ఆశ్చర్యపోయానంటూ ఉదయ్ సింగ్ గౌరీ ఇండియా టుడేతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.