Begin typing your search above and press return to search.
గుంజన్ పై సుశాంత్ ఎఫెక్ట్ ఎంత?
By: Tupaki Desk | 14 Aug 2020 9:10 AM GMTసుశాంత్ మృతి తర్వాత బాలీవుడ్ లో చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరో వైపు సుశాంత్ అభిమానులు మరియు సాదారణ ప్రేక్షకులు కూడా నెపొటిజంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. స్టార్ వారసులందరిని కూడా వరుస పెట్టి ట్రోల్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఆలియా భట్ నుండి జాన్వీ కపూర్ వరకు అంతా కూడా నెపొటిజం బాధితులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆలియా భట్ సడక్ 2 చిత్రం ట్రైలర్ కు వచ్చిన డిస్ లైక్స్ తో చెత్త ప్రపంచ రికార్డ్ ను దక్కించుకుంది.
సడక్ 2 తర్వాత ‘గుంజన్ సక్సేనా’ చిత్రం కూడా సుశాంత్ ఎఫెక్ట్ తో ఇబ్బంది పడాల్సి వస్తుంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. గుంజన్ పాత్రలో జాన్వీ కపూర్ మెప్పించింది. సినిమాకు విమర్శకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సినిమాలో జాన్వీ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆమె చక్కగా నటించిందని అంటున్నారు. అయితే నెపొటిజం పేరుతో ట్రోల్స్ చేస్తున్న వారు మాత్రం జాన్వీపై ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
జాన్వీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కాదు కనీసం ఆటో డ్రైవర్ గా కూడా సరిగా నటించలేదు. కాని ఆమెను తీసుకు వెళ్లి స్టార్ ను చేశారు. అదంతా కూడా ఆమె తల్లి శ్రీదేవి మరియు తండ్రి బోణీ కపూర్ వల్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారి వల్లే కదా సుశాంత్ వంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప్రతిభతో వచ్చిన వారికి ఆఫర్లు రావడం లేదు అంటూ అక్కడకి టాపిక్ తీసుకు వెళ్తున్నారు. పైగా ఈ సినిమాకు కరణ్ జోహార్ ఒక నిర్మాత అవ్వడం వల్ల కూడా నెటిజన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. మొత్తానికి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న గుంజన్ సక్సేనాపై సుశాంత్ మృతి ఎఫెక్ట్ కాస్త ఎక్కువగానే ఉందనిపిస్తుంది.