Begin typing your search above and press return to search.

ప్రియురాలు ఆశలను ఆవిరి చేశాడట

By:  Tupaki Desk   |   21 March 2018 5:00 AM IST
ప్రియురాలు ఆశలను ఆవిరి చేశాడట
X
బాలీవుడ్ లో రికమండేషన్స్ చాలా నడుస్తుంటాయనేది అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా కొంత మంది హీరోలు వారి గర్ల్ ఫ్రెండ్స్ కి అవకాశాలు చాలానే ఇస్తుంటారు. కష్ట కాలంలో ఉన్నప్పుడు హీరోయిన్స్ సహాయాన్ని అందిస్తారో లేదో తెలియదు గాని హీరోయిన్స్ కెరీర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రం హీరోలు తప్పకుండా సహాయం చేస్తుంటారు.

ఇటీవల అందుకు సాక్ష్యంగా కొంత మంది హీరోలు నిలిచారు. టైగర్ ష్రాఫ్ తన గర్ల్ ఫ్రెండ్ దిశా పటాని కోసం తన భాగి 2 సినిమాలో సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక అంతకుముందే అందరికి సల్మాన్ ఖాన్ సహాయంతో ఆదర్శంగా నిలిచాడు. కత్రినా కైఫ్ - జాక్వలిన్ ఫెర్నాండేజ్ లకు సల్లు బాయ్ తన హోదాతో అవకాశాలు ఇప్పించి వారి కెరీర్ ను సెట్ చేశాడు. ఇకపోతే అదే తరహాలో ఈ మధ్య ఓ హీరో తన గర్ల్ ఫ్రెండ్ కోసం అవకాశం ఇప్పించాలని చాలా ట్రై చేశాడు గాని ఫైనల్ గా విఫలయమయ్యాడు. అతను ఎవరో కాదు. ఎమ్ ఎస్ ధోని బయోపిక్ లో కనిపించిన సుశాంత్ రాజ్ ఫుట్. ఈ హీరో గత కొంత కాలంగా వన్ నేనొక్కడినే సినిమాతో పరిచయం అయిన కృతి సనన్ తో రిలేషన్ ని మెయింటెన్ చేస్తున్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. ఆ భామ ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాల్ని చాలానే అందుకుంటుంది.

అయితే ఆమె చెల్లి నుపూర్ సనన్ ని బాలీవుడ్ లో పరిచయం చేయించాలని చాలా ప్రయత్నం చేస్తోంది. అందుకోసం సుశాంత్ సింగ్ పై నమ్మకాన్ని ఉంచింది. అతని నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇవ్వాలని కోరిందట. మాట ఇచ్చిన సుశాంత్.. చిత్ర యూనిట్ ఆలోచన వలన.. కృతి సనన్ ఆశలను ఆవిరి చేశాడట. నుపూర్ ఫైనల్ అయ్యింది అనుకుంటున్న సమయంలో సుశాంత్ కు జోడిగా దర్శక నిర్మాతలు కొత్త అమ్మాయి సంజనను ఫైనల్ చేశారట. దీంతో కృతి బాయ్ ఫ్రెండ్ పై హార్ట్ అయ్యినట్లు బాలీవుడ్ లో టాక్ వస్తోంది.