Begin typing your search above and press return to search.
ఆ హీరో 1500 గంటల క్రికెట్ చూశాడట
By: Tupaki Desk | 18 April 2016 5:30 PM GMTఈ ఏడాది బాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘ఎం.ఎస్.ధోని.. ది అన్ టోల్డ్ స్టోరీ’ ఒకటి. టీమ్ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెటర్ గురించి అభిమానులకు తెలియని అనేక విశేషాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు దర్శకుడు నీరజ్ పాండే. ఆ మధ్య రిలీజైన టీజర్ జనాల్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. ముందు ఈ సినిమాకు బబ్లీగా కనిపించే సుశాంత్ రాజ్ పుత్ ను హీరోగా ఎంచుకోవడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. రఫ్ గా కనిపించే ధోని పాత్రకు అతనెలా సరిపోతాడని సందేహించారు. కానీ అతను ధోనిని ఎంత పర్ఫెక్టుగా ఇమిటేట్ చేశాడో టీజర్ చూస్తేనే అర్థమైపోయింది.
ఐతే ధోనిని సుశాంత్ అంత బాగా ఇమిటేట్ చేయడానికి ముందు సుశాంత్ ఎంత కష్టపడ్డాడో దర్శకుడు నీరజ్ పాండే చెప్పాడు. ఈ సినిమా ఒప్పుకున్నాక ధోనికి సంబంధించిన ఆటను దాదాపు 1500 గంటల పాటు చూశాడట సుశాంత్. ధోని క్రికెట్ కెరీర్లోని ప్రతి మ్యాచ్ నూ అతను మళ్లీ మళ్లీ రివైండ్ చేసి చూశాడట. చాలాసార్లు ధోని ఆడుతున్న మ్యాచ్ లకు హాజరయ్యాడట. ధోని పాల్గొన్న ప్రైవేటు కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎన్నో వీడియోలు చూసి.. అతడి బాడీ లాంగ్వేజ్ ను బాగా అధ్యయనం చేశాకే ఈ పాత్ర కోసం మేకప్ వేసుకున్నాడట సుశాంత్. సినిమా చూస్తే ధోని పాత్రలో సుశాంత్ ఎంత చక్కగా ఒదిగిపోయాడో తెలుస్తుందని.. సుశాంత్ కెరీర్లోనే ఇది బెస్ట్ పెర్ఫామెన్స్ అని అంటున్నాడు నీరజ్. ఎ వెడ్నస్ డే.. స్పెషల్ చబ్బీస్.. బేబీ లాంటి సెన్సేషనల్ మూవీస్ తీసిన నీరజ్ ‘ధోని’ బయోపిక్ ను ఎలా తీసి ఉంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.