Begin typing your search above and press return to search.

సుశాంత్‌ కేసు : సంజయ్‌ లీలా భన్సాలీ కారణమా?

By:  Tupaki Desk   |   4 July 2020 12:30 PM IST
సుశాంత్‌ కేసు : సంజయ్‌ లీలా భన్సాలీ కారణమా?
X
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఆయనది ఆత్మహత్యగా నిర్థారణకు వచ్చిన పోలీసులు అందుకు గల కారణాలను విశ్లేషించేందుకు పోలీసులు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులను ప్రశ్నించడం జరిగింది. సుశాంత్‌ డిప్రెషన్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని అందుకు సినిమాలు కొన్ని క్యాన్సిల్‌ అవ్వడమే అంటూ కొందరు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. సుశాంత్‌ కు కావాలని ఎవరైనా ఆఫర్లు రాకుండా చేశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

సుశాంత్‌ హత్య కేసులో భాగంగా ఇప్పటి వరకు పోలీసులు 29 మందిని విచారించారు. అందులో హీరోయిన్స్‌ రియా చక్రవర్తి సంజన కూడా ఉన్నారు. గతంలో సుశాంత్‌ తో ఒక సినిమాను సంజయ్‌ లీలా భన్సాలీ చేసేందుకు ఒప్పందం చేసుకుని కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చాడు. ఆ సినిమా క్యాన్సిల్‌ కు కారణం ఏమైనా ఉందా లేదంటే డేట్లు కుదరక పోవడం వల్లే సినిమాను చేయలేదా అనే విషయాన్ని పోలీసులు సంజయ్‌ లీలా భన్సాలీని విచారించి తెలుసుకోవాలని భావిస్తున్నారు.

ఈనెల 6వ తారీకున భన్సాలీ విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ అధినేత ను కూడా పోలీసులు విచారించనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చాలా స్పీడ్‌ గా విచారణ జరిపి సుశాంత్‌ ఆత్మహత్య కేసును క్లోజ్‌ చేయాలని ముంబయి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సుశాంత్‌ అభిమానులు మాత్రం నూటికి నూరు శాతం బాలీవుడ్‌ లో ఉన్న నెపొటిజం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ఆరోపిస్తున్నారు.