Begin typing your search above and press return to search.

వాళ్ళు ప్రేమికులే.. ఇదిగో సాక్ష్యాలు

By:  Tupaki Desk   |   28 July 2017 1:57 PM GMT
వాళ్ళు ప్రేమికులే.. ఇదిగో సాక్ష్యాలు
X
సెక్సీ బ్యూటి కృతి సనోన్ తన సినిమాలు వలన కంటే ఆమె ఇచ్చే ఇంటర్వ్యూలు వలన కొ-స్టార్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ తో నడుపుతున్న ప్రేమ వ్యవహారం వలనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. రాబ్తా సినిమా లో మొదటిసారి కలిసి నటించారు వీళ్ళు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టకుండానే వీళ్ళ పై పుకారులు వచ్చేసాయి. కానీ సుశాంత్, కృతి వీటిని కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు బాంద్రాలో ఓ ఇంటిలో జరిగిన పార్టీ ప్రకారం వీళ్ళు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ మీడియా బలంగా చెబుతోంది.

ఈ జూలై 27 నాడు కృతి సనోన్ తన 27 వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సంధర్భంగా సుశాంత్ తన ఇంటిలో ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. ‘బరేలి కి బర్ఫీ’ సినిమా నటులు మిగతా చిత్ర యూనిట్ తో కలిసి కృతి పుట్టిన రోజుని ఘనంగా చేశాడు. ఈ బర్త్ డే పార్టీకి ఈ సినిమాలో నటించిన రాజ్ కుమార్ రావు, సినిమా డైరెక్టర్ అశ్విని అయర్ తివారీ ఇంకా మరి కొంత మంది సన్నిహితులు మాత్రమే హాజరైయ్యారు. ఈ పార్టీ ద్వారా సుశాంత్ ఒక సూచిక అయితే ఇచ్చేశాడు అందరికి. అంతే కాకుండా వీళ్ళు ఒక పేరూన్న రెస్టారెంట్ కు వెళ్ళి డిన్నర్ కూడా చేశారట. అది కూడా కృతి సనోన్ చెల్లి నూపుర్ సనోన్ తో కలిసి వెళ్లారు.దానితో బహుశా వీళ్ళ ప్రేమ విషయం ఇద్దరి ఇళ్ళలో ఒప్పుకున్నారు అనే అనుమానం కూడా వచ్చింది మీడియా వాళ్ళకి. డిన్నర్ తరువాత సుశాంత్ ఆమెను తన కార్ లో కృతి ఇంటికి తీసుకువెళ్లి వదిలి వెళ్ళాడట. ఈ డ్రామా అంతా చూస్తున్న మీడియా కు వీళ్ళు ప్రేమలో పడ్డారు అని అనిపించదా మరి?

ఇప్పుడు మరో సంఘటన ఏంటంటే.. సుశాంత్ అండ్ కృతి కలసి ఒక స్పాకు వెళ్లారట. బయట మీడియా ఉంది అని తెలుసుకొని కృతి ముందు నుంచి వెళ్లిపోతే హీరో ఏమో వెనుక డోర్ నుండి వెళ్లిపోయాడు. అది సంగతి వాళ్ళు చెప్పటం లేదు కానీ ఈ విషయాలు అన్నీ ఆదారంగా చేసుకొని వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది మరి.