Begin typing your search above and press return to search.

పోస్ట్ మార్ట‌మ్ సిబ్బంది వ్యాఖ్య‌ల‌పై స్పందించిన సుశాంత్‌ సోద‌రి!

By:  Tupaki Desk   |   27 Dec 2022 8:04 AM GMT
పోస్ట్ మార్ట‌మ్ సిబ్బంది వ్యాఖ్య‌ల‌పై స్పందించిన సుశాంత్‌ సోద‌రి!
X
సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌.. ఈ బాలీవుడ్ యువ‌త‌రంగం 2020 జూన్ 14న అనుమానాస్ప‌దంగా మృతి చెంద‌డంతో దేశ వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లాన్ని సృష్టించింది. టెలివిజ‌న్ రంగం నుంచి సినీమా ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించిన సుశాంత్ బాలీవుడ్ లో ధృవ‌తార‌గా ఓ వెలుగు వెలుగుతాడ‌ని 'ఎం.ఎస్ ధోనీ ద అన్ టోల్డ్ స్టోరీ' చూసిన వారంతా భావించారు. త‌న‌కు బాలీవుడ్ లో ఉజ్వ‌ల‌మైన భ‌విష్య‌త్తు వుంద‌ని, రానున్న రోజుల్లో మంచి హైట్స్ కి వెళ‌తాడ‌ని అభిమానుల‌తో పాటు ఎంతో మంది ఫిల్మ్ ల‌వ‌ర్స్ అభిల‌షించారు.

కానీ అనూహ్యంగా సుశాంత్ సింగ్ అనుమానాస్ప‌ద తీరిలో మృతి చెంద‌డం ప్ర‌తీ ఒక్క‌రినీ క‌ల‌చివేసింది. అన‌ది ఆత్మ హ‌త్య అని కొంత మంది.. కాదు హ‌త్యేన‌ని మ‌రి కొంత మంది వాదించారు. ఇప్ప‌టికీ సుశాంత్‌ మృతి మిస్ట‌రీగానే కొన‌సాగుతోంది. అయితే సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు సుశాంత్ సింగ్ ది హ‌త్యేన‌ని, త‌న‌ని బాలీవుడ్ నెపోటిజ‌మ్ బ‌లితీసుకుంద‌ని జోరుగా ట్రోల్ చేయ‌డం తెలిసిందే.ఈ విష‌యంలో ప‌లువురు బాలీవుడ్ స్టార్ మేక‌ర్స్ టార్గెట్ చేస్తూ వారిని, బాలీవుడ్ ని బాయ్ కాట్ చేయాల్సిందే నంటూ నెట్టింట బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ ని వైర‌ల్ చేశారు.

గ‌త రెండున్న‌రేళ్లుగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి ఓ మిస్ట‌రీగానే కొన‌సాగుతూ వ‌స్తోంది. రీసెంట్ గా దీనిపై సీబీఐ విచార‌ణ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో సుశాంత్ మృతిపై పోస్ట్ మార్ట‌మ్ చేసిన సిబ్బందిలోని ఓ వ్య‌క్త కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణంపై పోస్ట్ మార్ట‌మ్ రిపోర్ట్ అందించిన రూప్ కుమార్ షా షాకింగ్ వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణించిన‌ప్పుడు కూప‌ర్ హాస్పిట‌ల్ లో ఐదు మృత‌దేహాల‌కు పోస్ట్ మార్ట‌మ్ నిర్వ‌హించాం. అందులో ఒక‌టి వీఐపీ మృత‌దేహం.

పోస్ట్‌మార్ట‌మ్ చేయ‌డానికి వెళ్లిన‌ప్పుడు ఆ వీఐపీ మృత దేహం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది అని తెలిసింది. అత‌ని బాడీపై అనేక గుర్తులున్నాయి. అంతే కాకుండా అత‌ని మెడ‌పై మూడు గుర్తులున్నాయి. పోస్ట్ మార్ట‌మ్ రికార్డ్ చేయాల్సింది.

అయితే ఉన్న‌తాధికారులు మాత్రం ఫొటోలు మాత్ర‌మే తీయాల‌ని చెప్పారు. అందుకే వారి ఆదేశాల ప్ర‌కార‌మే ఫొటోలు మాత్ర‌మే తీశాం' అని తెలిపారు. అంతే కాకుండా ఆయ‌న మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డించారు. సుశాంత్ సింగ్ బాడీని చూసిన వెంట‌నే తాను ఇది సూసైడ్ కాద‌ని, మ‌ర్డ‌ర్ అని పై అధికారుల‌కు తెలియజేశాన‌ని, అయితే సీనియర్స్ మాత్రం పోలీసులు చెప్పిన‌ట్టుగా చేయ‌మ‌న్నార‌ని తెలిపాడు.

ఈ వ్యాఖ్య‌ల‌పై సుశాంత్ సోద‌రి శ్వేతాసింగ్ స్పందించింది. 'హ‌త్య వాద‌న‌ల‌ను జాగ్ర‌త్త‌గా పరిశీలించాల‌ని సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ)ని కోరింది. ఈ అంశంలో ఇంతైనా నిజ‌ముంటే దానిని శ్ర‌ద్ద‌గా ప‌రిశీలించాల‌ని సీబీఐని కోరుతున్నాం. మీరు న్యాయ‌ప‌ర‌మైన విచార‌ణ జ‌రిపి నిజానిజాలు మాకు తెలియ‌జేస్తార‌ని మేము ఎప్ప‌టి నుంచో న‌మ్ముతున్నాం. ఇప్ప‌టికీ మా హృద‌యం ఈ విష‌యంలో త‌ల్ల‌డిల్లుతూనే వుంది. అంటూ #justiceforsudhanthsinghrajput అంటూ సోష‌న‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది. v


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.