Begin typing your search above and press return to search.
నెటిజన్లకు షాకిచ్చిన సుశాంత్ సోదరి
By: Tupaki Desk | 15 Oct 2020 1:30 AM GMTదివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి వ్యవహారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు బాలీవుడ్ థ్రిల్లర్ మూవీని తలపించేలా ఎన్నో మలుపులు తిరిగింది. సుశాంత్ సూసైడ్ మిస్టరీతో మొదలై....చివరకు డ్రగ్స్ రాకెట్, సీబీఐ విచారణ వరకు చేరింది. అయితే, సుశాంత్ వ్యవహారం సోషల్ మీడియాలో చాలాకాలంగా ట్రెండ్ అవుతోంది. జస్టిస్ ఫర్ సుశాంత్....కిల్ నెపోటిజం అంటూ నెటిజన్లు దివంగత నటుడికి మద్దతు తెలుపుతున్నారు. తన సోదరుడి మృతికి సంబంధించిన విషయాలు, విచారణపై సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సోషల్ మీడియాలో అప్డేట్లు ఇస్తూ యాక్టివ్ గా ఉంటున్నారు. సుశాంత్ కు మద్దతుగా నిలిచిన వారికి ఆమె సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపారు. అయితే, అనూహ్యంగా శ్వేతా సోషల్ మీడియా నుంచి నిష్క్రమించడం ఇపుడు చర్చనీయాంశమైంది. హఠాత్తుగా శ్వేత తన ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బుధవారం నాడు డిలీట్ చేశారు.
జస్టిస్ ఫర్ సుశాంత్ అంటూ నెటిజన్ల మద్దతు కూడగట్టి పోరాడుతున్న శ్వేత హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. అక్టోబర్14 నాటికి సుశాంత్ సూసైడ్ చేసుకొని 4 నెలలు పూర్తయిన సందర్భంగా "నిజమైన ప్రేరణ" అంటూ ఓ వీడియోను కూడా శ్వేత సోషల్ మీడియలో షేర్ చేశారు. ఆ తర్వాత హఠాత్తుగా తన ట్విటర్, ఇన్ స్టా ఖాతాలను శ్వేత డిలీట్ చేయడం సంచలనం రేపింది. అయితే శ్వేతా ఫేస్ బుక్ అకౌంట్ కొనసాగించడం విశేషం. కాగా, సుశాంత్ అనుమానాస్పద మరణం కేసులో రాబ్తా డైరెక్టర్ దినేష్ విజన్ కార్యాలయం, ఇంటిపైనా ఈడీ దాడులు నిర్వహించింది. మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తోన్న ఈడీ...ఈ సోదాలు నిర్వహించింది. 2016 లో రాబ్తా చిత్రంలో నటించిన సుశాంత్‌కు చేసిన చెల్లింపులపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.